సెలబ్రిటీలు ఏం చేసినా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అలాగే సెలబ్రిటీల పెళ్లిళ్లు , వారి విడాకులకు సంబంధించిన అనేక వార్తలు వైరల్ కూడా వైరల్ అవుతూ ఉంటాయి. బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన నటలలో ఒకరు అయినటువంటి అభిషేక్ బచ్చన్ చాలా కాలం క్రితమే బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తున్న ఐశ్వర్య రాయ్ ని వివాహం చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. వీరి వివాహం అయ్యి చాలా కాలం అవుతుంది. వీరి సంసార జీవితం ప్రస్తుతం ఎంతో సంతోషంగా ముందుకు సాగుతుంది. ఓ వైపు అభిషేక్ బచ్చన్ వరుస పెట్టి సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు.

ఇక ఐశ్వర్య రాయ్ మునుపటి రేంజ్ లో సినిమాలు చేయకపోయినా పర్వాలేదు అనే స్థాయిలో సినిమాలు చేస్తూ కెరియర్ను ముందుకు సాగిస్తుంది. ఇది ఇలా ఉంటే గత కొంత కాలంగా అభిషేక్ బచ్చన్ , ఐశ్వర్యా రాయ్ మధ్య విభేదాలు వచ్చాయి అని , వారిద్దరూ విడిపోతున్నారు అని ఓ వార్త తెగ వైరల్ అవుతూ వస్తుంది. తాజాగా ఇన్ డైరెక్ట్ గా అభిషేక్ బచ్చన్ ఈ వార్తలను స్ప్రెడ్ చేస్తున్న వారికి గట్టి కౌంటర్ ఇచ్చాడు. తాజాగా అభిషేక్ బచ్చన్ మాట్లాడుతూ ... సోషల్ మీడియాలో అనేక రూమర్స్ వస్తూ ఉంటాయి. 

వాటిని మేము అస్సలు ఏ మాత్రం పట్టించు కోము. అలాగే సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ కు మేము ఏ మాత్రం ప్రాధాన్యత కూడా ఇవ్వము. అలాగే అలాంటి వార్తలు నాపై అస్సలు ఎలాంటి ప్రభావాన్ని కూడా చూపవు. నా భార్య మరియు తల్లి కూడా బయట జరిగే విషయాలు ఇంట్లోకి అస్సలు తీసుకురారు. ప్రస్తుతం మా కుటుంబం అంతా కలిసి ఎంతో సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నాం అని ఆయన చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: