టాలీవుడ్ హీరో ప్రభాస్ పరువు తీశారు.. అయితే అది అభిమానులా లేకపోతే ప్రభాస్ పరువు ని కావాలని తీసేటువంటి ట్రాప్  చేస్తున్నారు లేదో తెలియదు కానీ ఈమధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి.. ఆ మధ్యలో అయోధ్య రామమందిరానికి సంబంధించి ప్రారంభోత్సవానికి ప్రభాస్ విరాళం ఇచ్చారని అక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా భోజనాలు తనే అరేంజ్ చేస్తున్నారనే విధంగా వినిపించాయి. అయితే ఈ విషయం బాగా వైరల్ గా మారడంతో చాలామంది ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా ప్రభాస్ రాజు కాబట్టి కొన్ని కోట్ల రూపాయలు ఉంటాయని అందరూ అనుకున్నారు.ఈ విషయం పైన ఆటు ప్రభాస్ టీమ్ కూడా క్లారిటీ ఇచ్చింది.


కానీ ఈ న్యూస్ మాత్రం చాలా వైరల్ గా మారింది. ఆ సమయంలో ప్రభాస్ కి మంచి జరిగిందో చెడు జరిగిందో తెలియదు కానీ.. ఇప్పుడు తాజాగా మరొక నటుడు ఫిష్ వెంకటేష్ కి ప్రభాస్ ఆర్థిక సహాయం కింద రూ .50 లక్షల రూపాయలు ఇచ్చారనే విధంగా వార్తలు వినిపించాయి. ఫిష్ వెంకట్ కీ రెండు కిడ్నీలు దెబ్బతిని హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే సహాయం చేయమని ఎవరిని అడిగినా కూడా సినీ ఇండస్ట్రీ వారు పట్టించుకోలేదు.


అయితే ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ 50 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని చేశారని ఆపరేషన్ ఖర్చు మొత్తం పెట్టుకుంటానని చెప్పారని సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది. దీంతో ఈ విషయం పైన ఫిష్ వెంకటేష్ భార్య దగ్గరికి వెళ్లి మీడియా అడగగా.. అలాంటిదేమీ లేదు అంటూ ఆమె తెలియజేసింది. అయితే ప్రభాస్ దగ్గర వరకు వెళ్లి ఉంటే చేసేవారేమో.. ఇదంతా కూడా కేవలం సోషల్ మీడియా రూమర్సే అంటూ తెలియజేసింది. అసలు ఈ న్యూస్ సృష్టించింది ఎవరు? పుట్టించింది ఎవరు?.. దీనివల్ల ప్రభాస్ కి లాభమా నష్టమా అన్నది తెలియాలి

మరింత సమాచారం తెలుసుకోండి: