ఏంటి మృణాల్ ఠాకూర్ పెళ్లి చేసుకుందా.. కాళ్ళకు మెట్టెలు ఎక్కడ నుండి వచ్చాయి. రహస్యంగా పెళ్లి చేసుకొని కాళ్లకు మెట్టెలతో కనిపించి అందరిని సర్ప్రైజ్ చేసిందా.. ఇంతకీ మృణాల్ ఠాకూర్ పెళ్లి చేసుకుంది ఎవరిని అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మృణాల్ ఠాకూర్ సీతారామం సినిమాతో ఓవర్ నైట్ లో క్రేజ్ సంపాదించింది. ఈ సినిమా కంటే ముందు పలు సీరియల్స్ లో చేసిన ఈ ముద్దుగుమ్మ సీతారామం సినిమాతో ఎక్కడలేని స్టార్డం సంపాదించింది. ఆ తర్వాత హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ సినిమాలతో పాటు లస్ట్ స్టోరీస్ -2 అనే వెబ్ సిరీస్ లో కూడా చేసింది. అంతేకాకుండా అడివి శేష్ తో డెకాయిట్ మూవీలో ఛాన్స్ అందుకుంది. అయితే తాజాగా మృణాల్ ఠాకూర్ ఫేస్ కనిపించకుండా తన కాళ్లు మాత్రమే కనిపించే ఫోటో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతుంది. 

ఆ ఫోటోలో మృణాల్ ఠాకూర్ తన కాళ్ళకు మెట్టెలతో దర్శనమిచ్చింది. దీంతో ఈ ఫోటో చూసిన చాలా మంది నెటిజన్లు  ఇదేంటి మృణాల్ కి పెళ్లి కాలేదు కదా.. ఈ మెట్టెలు ఎక్కడి నుండి వచ్చాయి. రహస్యంగా పెళ్లి చేసుకుందా అని చాలామంది ఈ ఫోటో కింద కామెంట్లు పెడుతున్నారు. ఇక అసలు విషయం ఏమిటంటే..మృణాల్ ఠాకూర్ కాళ్ళకు మెట్టెల తో షేర్ చేసిన ఆ పోస్ట్ డెకాయిట్ మూవీ యూనిట్ షేర్ చేశారు. అయితే   ఈ హీరోయిన్ డెకాయిట్ చిత్ర షూటింగ్లో పాల్గొనడం కోసం హైదరాబాద్ వచ్చింది అనే అప్డేట్ ని అభిమానులతో పంచుకోవడం కోసం అందమైన మృణాల్ ఠాకూర్ డెకాయిట్ మూవీ కోసం హైదరాబాద్ కి వచ్చింది మృణాల్ అడివి శేష్ అలాగే ప్రధాన తారాగణంతో ఉండే ఒక ముఖ్యమైన షెడ్యూల్ జరుగుతోంది.

అంతేకాకుండా డెకాయిట్ మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 25న విడుదల కాబోతోంది అనే విషయాన్ని ఇందులో షేర్ చేసుకున్నారు. అయితే ఈ షేర్ చేసిన పోస్టులో మృణాల్ ఠాకూర్ ఫేస్ కనిపించలేదు  కానీ ఆమె కాళ్లకు మెట్టెలతో కనిపించే సరికి చాలామంది షాక్ అయిపోయారు. అయితే ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ అడివి శేష్ భార్యగా కనిపించబోతుంది కావచ్చు. అందుకే ఆమె కాళ్లకు మెట్టెలు ధరించి కనిపించింది అంటూ చాలామంది నెటిజన్లు భావిస్తున్నారు.. యార్లగడ్డ సుప్రియ నిర్మిస్తున్న డెకాయిట్ మూవీకి షానల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: