
దిల్ రోజు బ్యానర్ లో నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వచ్చిన తమ్ముడు సినిమా తొలి రోజుకే తేలిపోయింది. డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అసలు ఇలాంటి కథని దర్శకుడు దిల్ రాజు ఎలా జడ్జి చేసి ఎంచుకున్నారో ? ఎవరికి అర్థం కావడం లేదు. ఎంత రొటీన్ కథని సినిమాగా ఎలా తీశారు ?అనే ప్రశ్న అందరిలోనూ మొదలవుతుంది. వెండితెరపై ఈ రొటీన్ కథ .. మరింత రొటీన్ సినిమాగా తెరకెక్కించారు. ఇంత సింపుల్ లైన్ ని ఎలా నమ్మి ?దిల్ రాజు సినిమాగా తీయడానికి ఒప్పుకున్నారో ? అర్థం కావడం లేదు. రాసుకుంటూ పోదాం ఏదో ఒకటి వస్తుంది అని దర్శకుడు .. తీసుకుంటూ పోదాం చివరికి హిట్ వస్తుందేమోనని నిర్మాత అనుకుని ఈ కథ సినిమాగా తీశారా అన్న సందేహాలు కలుగుతున్నాయి.
దిల్ రాజు ఈ సినిమా కోసం బాగా ఖర్చు పెట్టారు. ఆ విషయంలో అనుమానం లేదు. కానీ కథపై ఆయన ఎలాంటి వర్కౌట్ చేయలేదు. జడ్జిమెంట్ మరోసారి ఫెయిల్ అయింది. ఓ రొటీన్ కథ ని జియోగ్రాఫికల్ గా కొత్తగా చూపిస్తే వర్కౌట్ అవదన్న విషయాన్ని ఈ సినిమాతో అయినా ఆయన తెలుసుకోవాలి. సినిమా విజువల్స్ పరంగా బాగున్న ... క్లైమాక్స్ కు ముందు వచ్చే వీఎఫ్ ఎక్స్ చాలా వీక్ గా ఉన్నాయి. పాటలకు స్కోప్ లేదు. దర్శకుడుగా వేణు శ్రీరామ్ ఇంపాక్ట్ చూపించలేదు. ఇకపై అయినా దిల్ రాజు బడ్జెట్ ఖర్చు విజువల్స్ మీద కాకుండా కథ, కథనాల విషయంలో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు