"సుకుమార్".. ఇండస్ట్రీలో స్టార్ట్ డైరెక్టర్ . ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ గా రాజ్యమేలేస్తున్నాడు . హీరోలకి మించిన స్ధాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటాడు అంటూ ఎప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటాడు. ఆయన నమ్మిన కాన్సెప్ట్ ని ఎట్టి పరిస్థితిలోనూ అదే విధంగా తెరకెక్కిస్తారు . ఆ హీరో కోసమో ఈ హీరో కోసమో రాసుకున్న కథను మార్చుకోడు. సుకుమార్ గురించి ఇంతవరకే తెలుసు. కానీ సుకుమార్ లో కూడా ఒక ఎమోషనల్ ఫెలో ఉన్నాడు. సుకుమార్ కూడా తన ఎమోషన్ ని కంట్రోల్ చేసుకోలేడు అన్న విషయం రీసెంట్ గా బయటపడింది .


సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ అయిన సందర్భాలు చాలా చాలా తక్కువ.  ఈ మధ్యకాలంలో పుష్ప2 సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ గురించి ప్రశంసింస్తూ ఎమోషనల్ అయ్యారు. కాగా రీసెంట్గా సుకుమార్ తానా సభల్లో హాజరై ఎమోషనల్ గా స్పందించారు . దానికి కారణం మహేష్ బాబు . మహేష్ బాబుతో తెరకెక్కించిన "వన్ నేనొక్కడినే" సినిమా కోసం ఆయన చాలా చాలా కష్టపడ్డారు . ఎన్నో రిస్కీ పనులు కూడా చేశారు.  కానీ ఎందుకో ఈ సినిమా కాన్సెప్ట్ పెద్దగా జనాలకు ఎక్కలేదు.


తెలుగు ఇండస్ట్రీలో ఈ సినిమా ఫ్లాప్ అయింది . కానీ అమెరికాలో మాత్రం బాగా ఆదరించారు జనాలు. ఇదే విషయాన్ని సుకుమార్ మరొకసారి గుర్తు చేసుకున్నారు . "మహేష్ బాబుతో తెరకెక్కించిన "వన్ నేనొక్కడినే " సినిమా యు.ఎస్ ఆడియన్స్ ఆదరించకుండా ఉంటే నాకు మరొక సినిమా అవకాశం వచ్చుండేదే కాదు అని .. ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చిన మీరు ఆదరించడం వల్లే వన్ నేనొక్కడినే తర్వాత మరో సినిమా అవకాశం వచ్చింది అని.. మీకు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను అని ఎమోషనల్ కామెంట్స్ చేశారు" దీంతో సోషల్ మీడియాలో సుకుమార్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అంతేకాదు సుకుమార్ కి పునర్జన్మని కలిగించింది ఈ సినిమా అంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్నారు . సుకుమార్ చాలా ప్రయోగాత్మక చిత్రాలను తెరకెక్కిస్తూ ఉంటారు . అందులో ఒకటే ఈ నేనొక్కడినే . సుకుమార్ - మహేష్ బాబుతో చేసిన సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం ఇది. కాగా ప్రెసెంట్ సుకుమార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో ఒక సినిమా చేయబోతున్నాడు . ఈ పనుల్లో బిజీ బిజీగా తిరుగుతున్నారు..!!!

మరింత సమాచారం తెలుసుకోండి: