
మరీ ముఖ్యంగా నటుడు కృష్ణుడు నటించిన "వినాయకుడు" మూవీతో దర్శకుడుగా అరంగేట్రం చేశారు . కాగా ఆ తర్వాత విలేజ్ లో వినాయకుడు సినిమా .. ఆ తర్వాత రొమాంటిక్ ఎంటర్టైనర్ "కేరింత" మూవీ తీశారు . ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఆయన తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ షేర్ చేశారు . అడవి సాయికిరణ్ పేరు వార్తల్లో ఆ పోస్టు నిలిచేలా చేసింది . బైబిల్ , భగవద్గీతను పోస్టులో ప్రస్తావించడం ఇంకా హైలైట్ గా మారింది . ఆయన పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది .
"కొందరు బడా ప్లాట్ఫారం నిర్వాహకులు.. తనకు ఫోన్ చేసి సినిమా నిర్మించేందుకు ఆసక్తిగా ఉన్నామని చెప్పినట్లు ఆయన తెలిపారు.. అంతేకాదు తాను కూడా ఓకే అన్నాను అని అప్పుడు వారు బైబిల్ (బౌండ్ స్క్రిప్ట్) కావాలి అని అడిగారు అని నేను వెంటనే తాను బైబిల్ కాదు భగవద్గీత ఇస్తానని బదులిచ్చాను అని పేర్కొన్నారు. అంతే కాదు తాను గర్వంగా చెప్పుకునే హిందువునని కూడా మెన్షన్ చేశారు అంటూ తన పోస్టులో రాసుకొచ్చారు . దీంతో సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. "మతాన్ని సృజనాత్మకతలోకి ఎందుకు తీసుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. నేను హిందువుని సినిమా నిర్మాణంలో అలాంటి మతపరమైన మాన్యూపులేషన్ పద్ధతులను అనుమతించను నేను వారి ఆఫర్ ని తిరస్కరించాను జైశ్రీరామ్" అంటూ కూడా అడవి సాయికిరణ్ తెలిపారు . దీంతో ఆయన పోస్టు నెట్టింట వైరల్ గా మారింది..!