"అల్లు అరవింద్".. ఏ పని చేసిన సరే ఆచితూచి ఆలోచించి నిక్కాసు గా నిజాయితీగా చేస్తూ ఉంటాడు . ఇలానే అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు.  తెలుగులో ఇంకా దృఢంగా నిలబడి సినిమాలు తీస్తూ విజయవంతంగా సాగిపోతున్న సీనియర్ నిర్మాతలలో అల్లు అరవింద్ కూడా ఒకరు అన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. ఆయన తరం నిర్మాతలల్లో ఎంతోమంది ఇండస్ట్రీని ని ఖాళీ చేసి వెళ్లిపోయారు . సక్సెస్ రేట్ తగ్గిపోవడం బడ్జెట్లు  పెరిగిపోవడం ప్రొడక్షన్ నిర్మాతల చేతుల్లో లేని ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా తీయడం అనేది పెద్ద గగనంగా మారిపోయింది . అందుకే చాలామంది నిర్మాతలు సినిమా ఇండస్ట్రీ నుంచి తప్పుకునేస్తున్నారు .
 

కానీ అరవింద్ మాత్రం అలా కాదు ట్రెండ్ కి తగ్గట్టు ఆయన ఫాలో అయిపోతున్నాడు . అప్డేట్ అవుతూ జనాలకి కి ఎటువంటి మూవీస్ కావాలి అన్న విషయాన్ని ఆలోచిస్తూ అలాంటి సినిమాలను నిర్మిస్తూ వచ్చారు. అయితే ఒకప్పటిలా ఆయన బిగ్ బడా ప్రాజెక్ట్స్ నిర్మించకపోవడం గమనార్హం.  ఒకప్పుడు ఆయన నిర్మాణంలో ఎన్ని పెద్ద సినిమాలు వచ్చాయో తెలిసిందే. కానీ ఇప్పుడు మాత్రం అంత లో బడ్జెట్ ఫిలిమ్స్ చేసుకుంటున్నారు . అయితే ఇలాంటి మూమెంట్లోనే  అల్లు అరవింద్ ఒక వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ ని మిస్ చేసుకున్నాడు అన్న వార్త బయటకు వచ్చింది .



అది మరేంటో కాదు బాలీవుడ్ "రామాయణం".  నిర్మాత మధు మంతెన వేరే బాలీవుడ్ నిర్మతతో కలిసి ఆయన ఈ మెగా ప్రాజెక్టును అనౌన్స్ చేశారు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో ఈ సినిమా కథ ముందుకు వెళ్లలేదు . ఎన్నో ఏళ్లు గడిచిపోయాయి. సీన్  కట్ చేస్తే రామాయణం సెట్స్ మీదకు వెళ్ళింది కానీ ఆ ప్రాజెక్టులో మాత్రం అల్లు అరవింద్ లేరు . మధుమంతెన సైతం మిస్ అయిపోయాడు . ముందు వీళ్ళు ప్రకటించినట్లే నితీష్  తివారి దర్శకత్వంలో సినిమా మొదలైంది . కానీ కాస్ట్ అండ్ క్రూ లో భారీ మార్పులు జరిగాయి .



ఇందులో మహేష్ బాబును రాముడిగా చూపించాలి అంటూ పెద్ద చర్చ జరగడం విశేషం . అయితే వేరే ఆప్షన్లన్ని కొన్ని వినిపించాయి . కానీ లాస్ట్ కి అరవింద్ - మధుమంతెన ఈ ప్రాజెక్టు లో మిస్సయ్యారు.  కొత్త కొత్త మెంబర్స్ ఈ ప్రాజెక్టులో జాయిన్ అయ్యారు . మహేష్ బాబు ని రాముడి గా చూపించాలి అనుకున్న మేకర్స్ ఇప్పుడు ఆ ప్లేస్లో రన్బీర్ కపూర్ ని తీసుకొచ్చారు . అరవింద్ ఏ కారణంతో ఈ సినిమా నుంచి బయటికి వచ్చేసారో తెలియదు కానీ ఇటీవల రిలీజైన షో రీల్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని సెన్సేషనల్ కలెక్షన్స్ కలెక్ట్ చేస్తుంది అని అంత ధీమా వ్యక్తం చేస్తున్నారు .



ఇది ఇండియన్ బాక్స్ ఆఫీస్ లో బాహుబలిని బ్రేక్ చేసే రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి . ఇలాంటి మంచి 1000కోట్ల కలెక్ట్ చేసే సినిమాను అరవింద్ ఎందుకు మిస్ చేసుకున్నాడు అంటూ కూడా జనాలు మాట్లాడుకుంటున్నారు. అల్లు అరవింద్ భాగస్వామిగా ఉంటే జాతీ అంతర్జాతీయ స్థాయిలో గీతా ఆర్ట్స్ పేరు మారుమ్రోగిపోయేది  అని మాట్లాడుకుంటున్నారు.  ఎందుకు అల్లుఅరవింద్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు .. అసలు ఆయన తప్పుకున్నారా..? ఆయన ప్రాజెక్ట్ నుంచి లేపేసారా..? ఏమో ప్రజెంట్ మాత్రం అల్లు అరవింద్ క్రేజీ ప్రాజెక్ట్ మిస్ చేసుకున్నాడు అన్న వార్త బాగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: