మోస్ట్ గార్జియస్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని నయనతార గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నయనతార తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో భాగంగా ఆమె అనేక ఆసక్తికరమైన వివరాలను తెలియజేసింది. తాజాగా నయనతార మాట్లాడుతూ ... ఇప్పుడు సినిమాలు చూసే ప్రేక్షకులు మాత్రమే కాదు సినిమాలు చేసే నటీ నటులు కూడా కొత్త దనం కోరుకుంటున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీ లో రిలేషన్షిప్స్ కూడా కొత్త దనం గానే ఉంటాయి. అందుకు ప్రధాన కారణం ఒక్కో సినిమాను మనం ఒక్కో నటీ నటులతో , టెక్నీషియన్స్ తో చేస్తూ ఉంటాం.

ఒక సినిమా సమయంలో ఒకరితో మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. ఆ సినిమా ముగిసాక వారిని కొన్ని సార్లు కలిసిన చాలా గ్యాప్ రావచ్చు. దానితో మధ్యలో ఉన్న స్నేహం కాస్త తగ్గిపోతుంది. నా జీవితంలో కొద్ది మంది స్నేహితులు మాత్రమే ఉన్నారు. వారితోనే నేను అనేక విషయాలను పంచుకుంటూ ఉంటాను. ఇక సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో వ్యక్తిగత విషయాలను మాట్లాడుకోవడానికి అస్సలు సమయం ఉండదు. సెట్ కి వచ్చాము అంటే షూటింగ్ స్టార్ట్ అవుతుంది. షూటింగ్ లేదు అంటే డైలాగ్ ప్రిపరేషన్ ... ఏదో ఒక పని జరుగుతూ ఉంటుంది. ఏదో కొన్ని సందర్భాలలో మాత్రమే చాలా అరుదుగా వ్యక్తిగత విషయాలను మాట్లాడుకునే అవకాశం సినిమా షూటింగ్స్ స్పాట్ లో జరుగుతుంది అని నయనతార తాజాగా చెప్పుకొచ్చింది.

ఇకపోతే ప్రస్తుతం నయనతార అనేక తమిళ సినిమాలలో నటిస్తూ కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది. ప్రస్తుతం ఈమె తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగా 157 అనే వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: