
రవితేజ దుగ్గిరాల, హనురెడ్డి ప్రధాన పాత్రల్లో ఫణింద్ర నరిశెట్టి డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో సైతం ఈ సినిమా విడుదల కానుంది. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా గత నెలలో థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను మెప్పించే విషయంలో ఫెయిలైంది. ఈ సినిమాలో హీరోయిన్ రచయిత పాత్రలో నటించి ఆకట్టుకున్నారు.
మార్షల్ ఆర్ట్స్ లో సైతం ఆమె ప్రావిణ్యం సాధిస్తారు. మైత్రీ నిర్మాతలకు ఈ సినిమా మంచి లాభాలను అందించింది. కొన్ని వివాదాలలో చిక్కుకోవడం ఈ సినిమాకు ఒక విధంగా ప్లస్ కాగా మరో విధంగా మైనస్ అయింది. 8 వసంతాలు సినిమాకు ఇతర భాషల్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది. 8 వసంతాలు మూవీలో కథ, కథనం పరంగా ఆసక్తికర ట్విస్టులు ఉండటం గమనార్హం.
8 వసంతాలు మూవీ నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిందని చెప్పవచ్చు. సినిమాలో వరుణ్, సంజయ్ పాత్రలకు సంబంధించి చోటు చేసుకునే మలుపులు ఆకట్టుకున్నాయి. దర్శకుడు స్క్రీన్ ప్లే విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సినిమాకు ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. 8 వసంతాలు సినిమా నాటిక సనీల్ కుమార్ కు ఏ స్థాయిలో ప్లస్ అవుతుందో చూడాల్సి ఉంది. మైత్రీ నిర్మాతలు తెలివిగా అడుగులు వేస్తూ విజయాలను అందుకుంటున్నారు.