
అయితే ఇప్పుడు దీనికి ప్రత్యయం ఆలోచించే పనుల్లో రాజమౌళి ఉన్నట్టు తెలుస్తుంది .. ఇక్కడే గ్రీన్ మ్యాట్ వేసి షూటింగ్ కానిద్దామంటే అడవి బ్యాక్ డ్రాప్ కాబట్టి అంత నాచురల్ గా రాదు .. జంతువులు విఎఫ్ఎక్స్ లో మేనేజ్ చేయవచ్చు కానీ కెన్యాలో ఉండే అడవుల అందాన్ని ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేయడం అంత ఈజీ కాదు .. ఇప్పటికే కాశి ఎపిసోడ్ కోసం వేసిన సెట్ కి ఖర్చు తడిసి మోపుడు అయిందట .. 1000 కోట్ల బడ్జెట్గా చెబుతున్న ఈ విజువల్ గ్రాండ్ ఇయర్ కు ఆర్థికంగా ఎలాంటి సమస్య లేదు .. అంతర్జాతీయ సంస్థలు ఫండింగ్ కోసం రెడీగా ఉన్నాయి .. అయితే ఇక్కడ రాజమౌళి ఊరికే తొందరపడి సినిమాకు ఖర్చు పెట్టించే రకమైతే కాదు .
అయితే దీనికి సంబంధించిన క్లారిటీ మరికొన్ని రోజుల్లో రావచ్చు .. 2027 మార్చ్ విడుదలకు టార్గెట్గా పెట్టుకున్న రాజమౌళి ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఖచ్చితంగా అనుకున్న సమయం ప్రకారమే షూటింగ్ను పూర్తి చేయాలి .. ఎక్కడ గ్యాప్ వచ్చిన వాయిదాల గోల కనిపిస్తుంది .. త్రిబుల్ ఆర్ కు కరోనాతో పాటు ఇతర కారణాలు అడు వచ్చాయి .. ఇక ఇప్పుడు మహేష్ 29కి అలాంటి సమస్య రాదు అంటున్న టైంలో ఇప్పుడు కెన్యా ఊహించని ట్విస్ట్ ఇచ్చింది .. ఇక మరి చూడాలి దీన్ని ఎలా అధిగమిస్తారో .. ప్రియాంకా చోప్రా, పృథ్విరాజ్ సుకుమారన్ వంటి వారు కీలకపాత్రలో నటిస్తున్నారు .. ఈ భారీ పాన్ ప్యాన్ వరల్డ్ సినిమాకి కీరవాణి ఇప్పటి వరకు చేయని ప్రత్యేక తరహాలో సంగీతాన్ని క్రియేట్ చేయబోతున్నారట ..