టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజ్ సొంతం చేసుకున్న స్టార్ ప్రొడ్యూసర్లలో నాగవంశీ ఒకరు. ఈ నిర్మాత ఖాతాలో కూడా ఫ్లాపులు ఉన్నా ఆ ఫ్లాపుల సంఖ్య చాలా తక్కువ అనే సంగతి తెలిసిందే. నాగవంశీ నిర్మించిన కింగ్డమ్ మూవీ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. జులై 25వ తేదీన ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా హరిహర వీరమల్లు అదే తేదికి ఫిక్స్ కావడంతో ఈ సినిమా వాయిదా పడింది.

అధికారికంగా వచ్చిన సమాచారం ప్రకారం జులై 31వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. హరిహర వీరమల్లు సినిమాకు ఈ  నిర్ణయం వల్ల కొంత  ఇబ్బంది ఎదురైనా  కింగ్డమ్ సినిమాకు సరైన డేట్ దొరికిందని  చెప్పవచ్చు. రెండు వారాల పాటు బాక్సాఫీస్ వద్ద కింగ్డమ్ కు తిరుగు లేదని  సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నిర్మాత నాగవంశీ  భలే డేట్ పట్టాడుగా అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

విజయ్ దేవరకొండ గత సినిమాలు బాక్సాఫీస్ వద్ద తీవ్రస్థాయిలో నిరాశపరిచాయి.  కింగ్డమ్ సినిమాకు  బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది. కింగ్డమ్ సినిమా పాన్ ఇండియా సినిమాగా ఇతర  భాషల్లో సైతం విడుదల కానుంది. కింగ్డమ్ సినిమా  బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.  కింగ్డమ్ సినిమా ట్రైలర్ ఎప్పుడు విడుదలవుతుందో చూడాల్సి ఉంది.

కింగ్డమ్ మూవీలో విజయ్ దేవరకొండ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారని సమాచారం అందుతోంది. కింగ్డమ్ మూవీకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండటం గమనార్హం.  సితార బ్యానర్ కు సైతం ఈ సినిమా సక్సెస్ సాధించడం కీలకమని చెప్పవచ్చు.  దాకు మహారాజ్ సినిమాతో  సక్సెస్ సాధించిన సితార నిర్మాతలు ఈ సినిమాతో అంతకు మించిన విజయాన్ని అందుకుంటారేమో చూడాల్సి ఉంది. కింగ్డమ్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: