
సంగీతాన్ని అనిరుధ్ అందించడం కూడా హైలెట్ గా ఉన్నది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని నిర్మించారు ఈ సినిమా ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా పడింది. అయితే వాటన్నిటినీ మర్చిపోయేలా చిత్ర బృందం రిలీజ్ డేట్ ప్రోమోలో ఏదైనా చేస్తా సార్ అవసరమైతే మొత్తం పగలబెట్టేస్తా అంటే చెప్పే డైలాగుతో ప్రోమో హైలెట్గా నిలిచింది. ఇందులో విజయ్ దేవరకొండ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ తర్వాత కొన్ని కారణాల చేత ఖైదీగా మారి.. విలన్లను చితకబాదుతున్నట్లు కనిపిస్తోంది.
అంతేకాకుండా ఏదో ఒక తెగను సైతం కాపాడడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది విజయ్ దేవరకొండ. గతంలో ఎన్నడూ లేని విధంగా విజయ్ దేవరకొండ ఇందులో చాలా ఎమోషనల్ గా కనిపిస్తూ ఉన్నారు. సుమారు 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా విజయ్ కెరియర్లో కీలకంగా మారుతుందని అభిమానులు కూడా భావిస్తున్నారు. గడిచిన కొన్ని గంటల క్రితం విడుదలైన ప్రోమో మరింత ఆకట్టుకునేలా కనిపిస్తోంది. మరి ఏ మేరకు విజయ్ దేవరకొండ హిట్ అందుకొని ఫ్లాప్ల నుంచి బయటపడతారేమో చూడాలి. అలాగే భాగ్యశ్రీ కి కూడా ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంటుందంటు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.