ఈ మధ్యకాలంలో భక్తిరస చిత్రాలు ఏవి వచ్చినా పాన్ ఇండియా లెవెల్ లో భారీ హిట్ అవుతున్నాయి.. అదేవిధంగా కన్నప్ప చిత్రాన్ని కూడా మంచు విష్ణు  తీసుకొచ్చారు.. పాన్ ఇండియా లెవెల్ లో వచ్చిన ఈ చిత్రం మాత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అలాగే మంచు విష్ణు కూడా ఈ చిత్రం పైనే అనేక ఆశలు పెట్టుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.. కానీ ఈ సినిమా కూడా ఆయన ఆశలను అడియాశలు చేసింది..అనుకున్న విధంగా సినిమా థియేటర్లలో రన్ కాకపోవడంతో చిత్రం ఫ్లాప్ అయిపోయింది..అయితే సినిమా  కథ బాగాలేదని కాదు, యాక్టింగ్ నచ్చలేదని కాదు. ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమా తీయలేదని సీనియర్ సినీ విశ్లేషకులు అంటున్నారు.. తాజాగా కన్నప్ప సినిమాపై సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కొన్ని కామెంట్స్ చేశారు.. ఆయన ఏమన్నారు వివరాలు చూద్దాం.. కన్నప్ప చిత్రాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించారు..

 కానీ వారు పెట్టిన బడ్జెట్ కు  సరిపడా డబ్బులు అయితే రాలేదన్నారు.. ప్రస్తుతం చాలామంది  పాన్ ఇండియా మోజులో పడి  ఎక్కువ ఖర్చు పెట్టి సినిమాకు కలెక్షన్ రాకపోవడంతో ఇబ్బందుల పాలవుతున్నారు..ఆ విధంగానే మంచు విష్ణు కూడా  పాన్ ఇండియా లెవెల్లో సినిమా తీసుకురావాలని ఆలోచించారు తప్ప సినిమాను ఏ విధంగా తీస్తే ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందో దానిపై దృష్టి పెట్టలేదు.. ముఖ్యంగా పాత కన్నప్ప కొత్త కన్నప్పకి చాలా తేడా ఉంది. ఎన్నో మార్పులు చేశారు చాలా బాగా తీశారు..ఇక మంచు విష్ణు నటన అద్భుతమని చెప్పవచ్చు..ఇవన్నీ బాగా ఉన్న సినిమాకు మాత్రం ఖర్చు ఎక్కువైపోయిందని అంత బడ్జెట్ అవసరం లేదని చెప్పుకొచ్చారు..పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు  బాహుబలి, కల్కి, పుష్ప,  RRR వంటి చిత్రాలను చూసి పాన్ ఇండియా బాటలో వెళ్లారు.. చివరికి బొక్క బోర్లా పడ్డారని చెప్పుకొచ్చారు.

కన్నప్ప భక్తిరస చిత్రమైన కానీ  ఇది కేవలం మన లోకల్ ఆడియన్స్ కు మాత్రమే కనెక్ట్ అవుతుంది. శివుడు భారతదేశం అంతా ఉంటాడు.. కేవలం శివుని పార్వతిని హైలెట్ చేసి సినిమా తీసి ఉంటే అంత ఖర్చు అవసరం లేదు. ఈ చిత్రంలో భక్తిని మర్చిపోయి అన్ని ఎక్కువ చేసేసారు.. అందులో శివుడు పార్వతిని చూస్తే మాత్రం నాకు ఇరిగేషన్ వస్తోంది. ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టినట్టు కనిపిస్తోంది.. అలాకాకుండా సరికొత్త యాంగిల్ లో శివుడు పార్వతిని తీసుకువచ్చి న్యూ కథను క్రియేట్ చేసి ఇప్పటి ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా తీసుకుంటే సినిమా అద్భుతమైన హిట్ సాధించేది. కానీ అన్ని హంగులు పెట్టారు కానీ అసలు భక్తి అనే విషయాన్ని మర్చిపోయారు..భక్తి లేకపోవడం వల్లే సినిమా  ఫ్లాప్ అయిందంటూ తమ్మారెడ్డి కామెంట్ చేశారు. ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: