
అయితే వీరసింహారెడ్డి సినిమా టైమ్ లోనే బాలయ్య గోపీచంద్ తో మరో సినిమా చేస్తానని మాట ఇచ్చారు . ఇక ఇప్పుడు ఆ మాట ప్రకారమే గోపీచంద్ , బాలయ్య మరో సినిమా చేయబోతున్నారు .. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది .. బాలయ్య కెరియర్లో 111వ సినిమాగా రాబోతున్న ఈ సినిమా గురించి రీసెంట్ గానే అమెరికాలో జరిగిన తానా సభల్లో గోపీచంద్ మాట్లాడుతూ ఈ సినిమాలో బాలయ్యను ఇప్పటివరకు చూడని కొత్త యాంగిల్ లో చూపించబోతున్నాని సినిమాపై అంచనాలు పెంచిన విషయం తెలిసిందే .
ఇప్పటికే భారీ అంచనాలతో రాబోయే ఈ సినిమా గురించి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ వార్త వినిపిస్తుంది .. ఈ సినిమాల్లో కీలక పాత్రలో నటించడానికి డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఇద్దరు ప్రముఖ నటులతో డిస్కషన్ మొదలు పెట్టారని తెలుస్తుంది .. అయితే ఆ నటులు ఎవరినేది ఇంకా తెలియదు కానీ ఈ వార్త మాత్రం ఇప్పుడు సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేస్తుంది .. ఇవన్నీ చూస్తుంటే గోపీచంద్ ఈసారి వీర సింహారెడ్డిని మించి మరో సినిమాను బాలయ్యతో ప్లాన్ చేస్తున్నట్టు అర్థమవుతుంది .