సినిమా హిట్‌ అయితే దానికి సీక్వెల్ తీయాలనుకోవడం లో తప్పేమీ లేదు . కానీ ఆ సీక్వెల్‌ మూల సినిమా కంటే చెత్తగా ఉంటే ? ఫస్ట్ పార్ట్‌కి వచ్చిన గౌరవాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తునారు ? ఇటీవలి కాలంలో కోలీవుడ్‌ దర్శకులు , హీరోలు అందరిలోనూ ఇదే రీపిట్‌ అవుతున్న సంగతి. తమిళ సినీ ఇండస్ట్రీలో సీక్వెల్‌ల పతనం ఓ ట్రెండ్‌గా మారిపోయింది . కాంచన, సింగం, అరణ్మనై, డీమాంట్ కాలనీ లాంటి కొన్ని సినిమాల సీక్వెల్స్ మాత్రమే ప్రేక్షకుల మన్ననలు పొందగలిగాయి . మిగతావన్నీ? జస్ట్ ఫ్లాపుల పరంపరే. స్టార్ హీరోలే తెలిసీ తెలిసీ మళ్లీ అదే దారిలో నడవడం, చేతులు కాల్చుకోవడం గమనార్హం. కమల్ హాసన్‌ను తీసుకుంటే ... నేషనల్ రేంజ్ ఉన్న "విశ్వరూపం 2", "ఇండియన్ 2" సినిమాలు కూడా బాక్సాఫీస్‌ దగ్గర ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయినా, ఆయన కూడా ఈ విష‌యంలో ఆగట్లేదు.
 

ఇక ఇప్పుడు "ఇండియన్ 3"తో ప్రేక్షకులపై త‌న ప్రతీకారం తీర్చుకునేందుకు రెడీ అవుతున్నాడు. పైగా "విక్రమ్ 2" కూడా ప్లాన్‌లో ఉంది. రజనీ మాత్రం ‘రోబో’ తర్వాత సీక్వెల్‌లో కనిపించలేదు. కానీ ఇప్పుడు "జైలర్ 2"కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విక్రమ్ “స్వామి స్క్వేర్”, విశాల్ “సందకోజి 2”, లారెన్స్ “చంద్రముఖి 2”, విజయ్ సేతుపతి “విడుదల పార్ట్ 2” – ఇవన్నీ బాక్సాఫీస్‌ దగ్గర ఆశించిన స్థాయిలో ఆడకపోవడం పక్కన పెడితే, వీరి పరువు కుడా గంగపాలుఅయింది . ఇప్పుడు ఈ జాబితాలోకి యంగ్ హీరోలు కూడా ఎంటర్ అవుతున్నారు. ముఖ్యంగా కార్తీకి సీక్వెల్ మానియా బాగా పట్టేసింది. ఖైదీ 2, ఖాకీ 2, సర్దార్ 2, యుగానికి ఒక్కడు సీక్వెల్, HIT సిరీస్ పార్ట్ 4 వరకూ లైనప్‌లో పెట్టేశాడు. అంతేకాదు, విష్ణు విశాల్ కూడా రాక్షసుడు 2, గట్టా కుస్తీ 2 అంటూ ప్రమోట్ చేస్తున్నాడు. గౌతమ్ కార్తీక్ కూడా తన సినిమాల సీక్వెల్స్‌ ప్లాన్ చేస్తున్నాడు.

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: