కోలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు పొందిన నయనతార తన పర్సనల్ లైఫ్ లో ఎన్నో వివాదాలో నిరంతరం ఇమే పేరు ఎక్కువగా వినిపిస్తోంది. మళ్లీ అదే సమయంలోనే స్టార్ హీరోలకు మించి మరి క్రేజీ సంపాదించుకుంది. రెమ్యూనరేషన్ పరంగా ఇతర హీరోయిన్ల కంటే కొంతమేరకు ఎక్కువగానే తీసుకుంటుంది. ఈ అమ్మడు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్న ప్రమోషన్లకి మాత్రం రాదనే విమర్శలు ఎన్నోసార్లు ఎదుర్కొన్నది. అలాగే పలు వివాదాలలో కూడా ఈమె పేరు ఎక్కువగా వినిపించింది. ప్రముఖ డైరెక్టర్ విఘ్నేష్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అలాగే సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు కూడా జన్మనిచ్చింది.


తాజాగా నయనతారకు ఒక బిగ్ షాక్ తగిలినట్లుగా తెలుస్తోంది. నెట్ ఫ్లిక్ లో విడుదలైన నయనతార డాక్యుమెంటరీ పైన ప్రముఖ హీరో ధనుష్ కోర్టు మెట్లు ఎక్కారు. తన సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఆడుకున్నందుకు ధనుష్ నిర్మాణ సంస్థ భారీ మొత్తంలోనే డబ్బులను  ఇవ్వాలని కోర్టుమెట్ల ఎక్కారు. అయితే ఇప్పుడు తాజాగా డాక్యుమెంటరీ పైన మరో నిర్మాణ సంస్థ 5 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ నయనతారకు నోటీసులను పంపించింది.


నయనతార జీవితం గురించి తెరకెక్కించిన ఈ డాక్యుమెంటరీ నెట్ ఫ్లిక్ ఓటీటిలో విడుదలైన రెస్పాన్స్ సంగతి బాగానే ఉన్న. ఈ డాక్యుమెంటరీ వల్ల ఎన్నో వివాదాలు కూడా నయనతారను చుట్టుముట్టాయి. గతంలో తన భర్త తెరకెక్కించిన నానుమ్ రౌడీ డా చిత్రంలో నటించిన నయనతార. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే నయనతార, విఘ్నేష్ మధ్య ప్రేమాయణం చిగురించిందని ఆ సినిమాకి సంబంధించి కొన్ని సన్నివేశాలను కూడా డాక్యుమెంటరీలో యూస్ చేశారు.ఆ తర్వాత నయనతార కు సంబంధించి ఇతర సినిమాలలో కనిపించిన కొన్ని దృశ్యాలను డాక్యుమెంటరీలో తీసుకున్నారట. చంద్రముఖి సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఉపయోగించడంతో ఈ సినిమా హక్కులను కలిగి ఉన్న ఏపీ ఇంటర్నేషనల్ ఇప్పుడు నయనతారకు నోటీసులు పంపించారని దీని ద్వారా కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించారంటు నోటీసులను జారీ చేశారట.

మరింత సమాచారం తెలుసుకోండి: