
కాగా ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ పెళ్లి చేసుకోబోతుంది అన్న వార్త బాగా ట్రెండ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్స్ బ్యాక్ టు బ్యాక్ అందరూ పెళ్లిలు చేసేసుకుంటున్నారు. మరి ముఖ్యంగా కీర్తి సురేష్ ఇంత త్వరగా పెళ్లి చేసుకుంటుంది అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు. అది కూడా తన చిన్ననాటి స్నేహితుడిని పెళ్లి చేసుకుంది. ఆమె పెళ్లి ఫొటోస్ బాగా ట్రెండ్ అయ్యాయి. వైరల్ అయ్యాయి . ఈ మధ్యకాలంలో కీర్తి సురేష్ ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వినిపించిన అదంతా ఫేక్ అంటూ కొట్టి పడేసింది కీర్తి సురేష్ .
అయితే కీర్తి సురేష్ తరహా లోనే వెళ్తుంది ఓ హీరోయిన్ అంటూ తెలుస్తుంది. తన చిన్న నాటి స్నేహితుడిని పెళ్లి చేసుకోబోతుంది మిల్కీ బ్యూటీ తమన్నా అంటూ ఓ న్యూస్ తెరపైకి వచ్చింది . నిజానికి తమన్నా పెళ్లి వార్త ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. కానీ ఆమె స్వయంగా విజయ్ వర్మతో డేటింగ్ లో ఉన్నాను అన్న విషయాన్ని బయటపెట్టింది . గత కొన్ని రోజులుగా వాళ్ళిద్దరి మధ్య దూరం నడుస్తుంది అంటూ బాలీవుడ్ మీడియా కూడా కోడైకూస్తుంది. ఈ క్రమంలోనే తమన్నా నుంచి విజయ్ వర్మ దూరంగా ఉంటున్నాడు అని ..వేరే అమ్మాయితో ఆయన క్లోజ్ గా మూవ్ అవుతున్నాడు అని బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఇలాంటి క్రమంలోనే తమన్నా తన చిన్ననాటి స్నేహితుడు కి ప్రపోజ్ చేసి మరి పెళ్లి చేసుకోబోతుంది అన్న వార్త బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే దీనిపై తమన్నా ఎటువంటి అఫీషియల్ ప్రకటన ఇవ్వలేదు. తన కుటుంబ సభ్యులు కూడా ఏ విధంగా స్పందించలేదు . ఇది కేవలం పుకారేనా..? లేకపోతే నిజంగానే తమన్నా.. తన చిన్ననాటి బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోబోతుందా..? తమన్నా వివరిస్తేనే తెలుస్తుంది . ప్రస్తుతానికైతే ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది..!!