సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది కెరియర్ ప్రారంభంలో కాస్త బొద్దుగా ఉన్న ఆ తర్వాత సన్నబడి అద్భుతమైన లుక్ లోకి వస్తూ ఉంటారు. ఇక మరి కొంత మంది కెరియర్ ప్రారంభంలో స్లిమ్ గా ఉన్నా కూడా ఆ తర్వాత లావు అయినవారు కూడా ఉన్నారు. ఇకపోతే కొంత మంది మాత్రమే ఒకే రేంజ్ లో బరువును మెయింటైన్ చేస్తూ వస్తూ ఉంటారు. ఇక అలాంటి వారు ఎక్కువ జిమ్ లోకి వెళతారు అని , జిమ్ లో ఎక్కువగా గంటలు వర్కౌట్ చేయడం వల్ల వారు బరువు పెరగకుండా , తగ్గకుండా సమాన స్థితిలో ఉంటారు అనే అభిప్రాయాలను కూడా కొంత మంది వ్యక్త పరిచిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఇకపోతే ఎక్కువ శాతం నటి మణులు జిమ్ లలో అనేక గంటలు వర్కౌట్లను చేసి తమ బరువును కంట్రోల్లో ఉంచుకుంటూ వస్తారు. ఇకపోతే ఓ స్టార్ బ్యూటీ మాత్రం జిమ్ లోకి వెళ్లకుండానే బరువును తగ్గించుకున్నట్లు స్టేట్మెంట్ ఇచ్చింది. ఇంతకు ఆమె ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె ఎవరో కాదు బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ నటిగా చాలా సంవత్సరాల పాటు కెరీర్ను కొనసాగించిన విద్యా బాలన్. విద్యా బాలన్ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో భాగంగా మాట్లాడుతూ ... నేను కెరియర్ ప్రారంభంలో కాస్త లావుగా ఉండే దాన్ని. దాని వల్ల నాపై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. 

దానితో నేను బరువు తగ్గాలి అని జిమ్ లో అనేక వార్కౌట్ లు కూడా చేశాను. కానీ దాని వల్ల ప్రయోజనం లేకుండా పోయింది. ఆ తర్వాత నా బరువుకు కారణం ఫ్యాట్ కాదు అని తెలిసింది. దానితో నేను న్యూట్రిషన్ల సలహా మేరకు డైట్ ఫాలో అయ్యాను. దానితో నేను చాలా వరకు బరువు తగ్గాను. జిమ్ లోకి వెళ్ళకుండానే నేను డైట్ ఫాలో అయ్యే బరువు తగ్గాను అని విద్యా బాలన్ తన బరువు తగ్గడానికి గల సీక్రెట్ ను తాజాగా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: