"సితార" ఘట్టమనేని ..ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. తాత పెద్ద హీరో ..నాన్న అంతకుమించిన హీరో .. అమ్మ బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేసిన ఓ హీరోయిన్ ఇలా బ్యాక్ గ్రౌండ్ ఆమెకు బాగానే కలిసి వచ్చింది. సితార సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుంది అనేది అందరికీ తెలిసిందే.  త్వరలోనే ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రాబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . అయితే దీనిపై ఇంకా ఆఫీషియల్ ప్రకటన రాలేదు . సినిమా ఇండస్ట్రీలో కి సితార వస్తుంది.. కానీ ఎప్పుడు వస్తుందో.. చెప్పలేం అంటూ ఘట్టమనేని కుటుంబ సభ్యులు చెప్పుకు వస్తున్నారు .


ఇలాంటి మూమెంట్లోనే  అడపాదడపా సందర్భాలలో సితారా డాన్స్ వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ ఉంటాయి.  సితార ఘట్టమనేని డాన్స్ చాలా బాగా చేస్తుంది. ఇప్పుడున్న హీరోయిన్స్ అందరికన్నా సితార చాలా బాగా డాన్స్ చేస్తుంది . మరీ ముఖ్యంగా ట్రెడిషనల్ డ్యాన్స్ అదరగొట్టేస్తుంది.  సితార డ్యాన్స్ టీచర్ ఎవరు ..? ఆమెకు మహేష్ బాబు ఎంత ఫీజ్ ఇస్తారు...?  అనే విషయాలు వైరల్ అవుతున్నాయి . కాగా సితారకు డ్యాన్స్ మాస్టర్ ..డ్యాన్స్ నేర్పించేది మరెవరో కాదు లేడీ కొరియోగ్రాఫర్ "అనీ మాస్టర్".



సినిమాలలో ఎన్నెన్నో మంచి పాటలకు డాన్స్ కొరియోగ్రాఫీ చేశారు అనేది అందరికీ తెలిసిందే . పలు షోలకి ఆమె జడ్జిగా కూడా వ్యవహరించారు . చాలా మంచి బ్యాక్ గ్రౌండ్ ఉన్న అనీ మాస్టర్ ని సితారఘట్టమనేని కు డాన్స్ మాస్టర్ గా చూసి చేసుకుంది నమ్రత శిరోద్కర్ . అంతే కాదు మహేష్ బాబు స్వయంగా పెద్ద బెంజ్ కారును అనీ  మాస్టర్ ఉండే అపార్ట్ మెంట్ దగ్గరికి పంపిస్తారట . రోజు పికప్ అండ్ డ్రాపింగ్ మహేష్ బాబు వాళ్ళ కార్ నే చేసుకుంటుందట . అంతేకాదు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం అనీ మాస్టర్ కి మహేష్ బాబు దాదాపు నెలకి 15 లక్షలకు పైగా డాన్స్ నేర్పించినందుకు ఫీజ్ కింద ఇస్తున్నారట.  సాధారణంగా బయట ఇంత ఫీజ్ ఇవ్వరు అనేది అందరికి తెలుసు. యానీ మాస్టర్ లాంటి స్టార్ కొరియోగ్రాఫర్ కి ఇలాంటి ఒక ఛాన్స్ రావడం నిజంగా గ్రేట్ అంటున్నారు.  సితార ఇప్పుడు ఇంత బాగా డాన్స్ చేస్తుంది దానికి కారణం అనీ మాస్టర్ అంటూ చెప్పుకొస్తున్నారు. అనీ మాస్టర్ ని కూడా ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: