గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ పై ఎలాంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి అనేది మన అందరికీ తెలిసిందే. మరి ముఖ్యంగా రామాయణ సినిమాలో ఆమె "మండోదరి" పాత్రకు సెలెక్ట్ అయింది అన్న వార్త ఇండస్ట్రీని షేక్ చేసేసింది . కాజల్ ఫ్యాన్స్ అయితే ఓ రేంజ్ లో ఆమెను పొగిడేశారు. మరికొందరు కాజల్ రేంజ్ ఏంటి .. కాజల్ మండోదరి పాత్రలో  నటించడం ఏంటి..? అంటూ బాగా ట్రోల్ చేశారు . అయితే చాలామంది కాజల్ ని పొగిడేస్తూ హీరోయిన్ సాయి పల్లవి పై ఎలా నెగిటివ్ కామెంట్స్ చేశారు అనేది అందరికీ తెలుసు.
 

కాజల్ అగర్వాల్ "మండోదరి" పాత్రలో నటిస్తే సాయి పల్లవి దగ్గరికి రావణాసురుడైన యాష్ ఎందుకు వెళ్తాడు..?? అంటూ సోషల్ మీడియాలో దారుణాతి దారుణమైన కామెంట్స్ వినిపించాయి . అంతే కాదు చాలామంది ఇది రాంగ్ సెలక్షన్ అని.. ఒకటి సాయి పల్లవి ని ఆ క్యారెక్టర్ నుండి  మార్చండి లేదంటే కాజల్ నైనా ఈ సినిమా నుంచి తీసేయండి అంటూ చాలా రకాలుగా జనాలు మాట్లాడుకున్నారు . అయితే తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. హీరోయిన్ కాజల్ అగర్వాల్ ను రామాయణ ప్రాజెక్ట్ నుంచి తీసేసారు అన్న టాక్ ట్రెండ్ అవుతుంది.

 

నిజానికి కాజల్ ని మండోదరి పాత్రలో చూస్ చేసుకోకముందు వరకు చాలా బాగా ఈ సినిమా హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అయ్యేవి. సాయి పల్ల్వి పై కూడా మంచి అభిప్రాయమే ఉండేది.  కాజల్ నిచూస్ చేసుకున్నాకే ఈ తలనొప్పులు స్టార్ట్ అయాయి.  తీసేసి వేరే హీరోయిన్ ని చూస్ చేసుకున్నారట. ఆమె మెరి ఎవరో కాదు మృణాల్ ఠాకూర్. ఎస్ ఇండస్ట్రిలో ఇప్పుడు ఇదే న్యూస్ ఇంట్రెస్టింగ్గా ట్రెండ్ అవుతుంది . బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మృణాల్ ఠాకూర్ ..మండోదరి పాత్రలో నటించబోతుందట . కాజల్ గురించి సోషల్ మీడియాలో పెడుతున్న  కామెంట్స్ ఆమెని సినిమా నుంచి తీసేసేలా చేసాయి అని ఓ న్యూస్ బాగా  ఎక్కువగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: