అసలే ఓ పక్క బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తో సతమతం అవుతుంటే.. మరోపక్క పూజ హెగ్డేకి కుర్ర హీరోయిన్లు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. చేతి దాకా వచ్చిన అవకాశాలను కాలితో తన్నుకుపోతున్నారు. టాలీవుడ్ లో పూజా హెగ్డేకు దక్కాల్సిన అవకాశాలన్నీ యంగ్ సెన్సేషన్ శ్రీలీల కొట్టేస్తోంది. `గుంటూరు కారం`, `ఉస్తాద్ భగత్ సింగ్` వంటి సినిమాలన్నీ పూజా చేతి నుంచి జారీ శ్రీలీల ఖాతాలోకి వెళ్ళినవే. అయితే ఇప్పుడు కోలీవుడ్ లోనూ అదే పరిస్థితి ఏర్పడింది.


పూజా హెగ్డేకు అక్కడ యంగ్ బ్యూటీ మమితా బైజు టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది. ఇటీవల `ప్రేమలు` సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న మమితా.. ప్రస్తుతం తమిళంలో మోస్ట్ వాంటెడ్ గా మారింది. ఇప్పటికే కోలీవుడ్ స్టార్ ద‌ళ‌పతి విజయ్ కు జోడిగా `జన నాయగన్` చిత్రంలో నటిస్తోంది. మరోవైపు `సూర్య 45`లో ఛాన్స్ కొట్టింది. త్వరలో ప్రదీప్ రంగనాథన్ తో కలిసి `డ్యూడ్‌` మూవీతో ప్రేక్షకులను పలకరించ‌నుంది. అయితే తాజాగా మమితా ఖాతాలో మరో బిగ్ ప్రాజెక్టు వచ్చి చేరింది.


ధనుష్ త‌న‌ 54వ సినిమాను విఘ్నేష్ రాజా దర్శకత్వంలో చేయ‌బోతున్నాడు. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా రానున్న ఈ సినిమాను వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మిస్తోంది. త్వ‌ర‌లోనే పూజా కార్య‌క్ర‌మాల‌తో ఈ మూవీ సెట్స్ మీద‌కు వెళ్ల‌బోతుంది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డేను మేక‌ర్స్ ఎంపిక చేశార‌ని బ‌లంగా ప్ర‌చారం జ‌రిగింది. కానీ, అఖ‌రి నిమిషంలో మేక‌ర్స్ మ‌న‌సు మార్చుకున్నారు. పూజా హెగ్డేకు బదులుగా మ‌మితా బైజును ధ‌నుష్‌కు జోడిగా ఫైన‌ల్ చేశార‌ట‌. ఇది నిజంగా పూజా హెగ్డేకి బిగ్ షాక్ అనే చెప్పొచ్చు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: