
కింగ్ డమ్’ జూలై 31న విడుదల కానుంది . కానీ ఆ డేట్ చుట్టూ బాక్సాఫీస్‌పై భారీ ఒత్తిడే ఉంది. జూలై 25: పవన్ కల్యాణ్ నటించిన హరి హర వీరమల్లు విడుదల .. ఆగస్టు 14: కూలీ, వార్ 2 వంటి బిగ్ బడ్జెట్ చిత్రాలు రిలీజ్ ఈ మూడు సినిమాల మధ్య ‘కింగ్ డమ్’ తలపడి విడుదల అవ్వబోతున్న నేపథ్యంలో… నాగవంశీకి పవన్ సినిమాకు ఢీ ఇవ్వాలనే ధైర్యం వుందని కనిపిస్తోంది. వీరమల్లు భారీ హిట్ అయితే… ఫ్యామిలీ ఆడియన్స్ రెండో వారం నుంచి మరింతగా థియేటర్లకు చేరే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ‘కింగ్ డమ్’కి స్పేస్ తగ్గే ఛాన్స్ కూడా ఉంటుంది. అలాగే మళ్లీ మూడో వారం నుంచి పెద్ద సినిమాల దాడి మొదలవుతుంది. ఈ పరిస్థితుల్లో నాగవంశీ డేట్‌ను డిలే చేయకుండా ముందే రిలీజ్ చేయడంలో ఓ స్ట్రాటజీ ఉండొచ్చు.
ప్రస్తుతం టికెట్ రేట్లు పెరిగే ట్రెండ్‌లో ఉన్నాయి. ఒక వారంలో ఓ పెద్ద సినిమా విడుదల అయితే ... ఆర్థికంగా ప్రేక్షకులపై ఒత్తిడి ఉంటుంది. వీరమల్లు – కింగ్ డమ్ రెండూ హై బడ్జెట్ చిత్రాలే కావడంతో, రెండు వారాల్లో రెండు పెద్ద సినిమాలను చూసే అవకాశం, ఆసక్తి, డబ్బు ప్రేక్షకులకు ఉంటుందా అన్నది ప్రశ్నే. నాగవంశీ రిస్క్ టేకింగ్ మైండ్‌సెట్ మరోసారి బలంగా కనిపిస్తోంది. కానీ ఈసారి గేమ్ గట్టిగా ఉందనే చెప్పాలి. కంటెంట్ స్ట్రాంగ్ అయితే, ‘కింగ్ డమ్’ క్లాష్ మధ్యన కూడా హిట్ అవ్వచ్చు. లేదంటే... బాక్సాఫీస్ రేసులో వెనుకపడే అవకాశాలున్నాయి.