
ఈ నేపథ్యంలో తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన చాలా మంది స్టార్స్ ఆయన పార్ధివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు . అందులో భాగంగానే పాన్ ఇండియా డైరెక్టర్ దర్శకధీతుడు రాజమౌళి కూడా కోటా శ్రీనివాసరావు పార్థివ దేహాని సందర్శించి నివాళులర్పించారు . వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు . అయితే రాజమౌళి తిరిగి కారులో బయలుదేరడానికి కారు ఎక్కుతూ ఉండగా ఆ సమయంలో ఓ యువకుడు పదే పదే రాజమౌళితో సెల్ఫీ తీసేందుకు ప్రయత్నించాడు .
అది చూసి చూడనట్లు రాజమౌళి వెళ్లిపోతూ ఉండగా..రాజమౌళి పై ఆ యువకుడు ఫోకస్ మాత్రం గట్టిగా పడింది . రాజమౌళి వెనకే పరిగెడుతూ సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించారు . దీంతో కోపంతో రాజమౌళి అసహనం వ్యక్తం చేశారు "ఎక్కడకి వచ్చి ఏం చేస్తున్నావ్ ..?" అంటూ ఆయన కోప్పడ్డారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాజమౌళి కాదు చాలామంది స్టార్స్ ఇదే విధంగా సెల్ఫీలు తీసుకునే క్రమంలో చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరీ ముఖ్యంగా కొంతమంది అసలు ఎక్కడికి వచ్చాం..? ఏం చేస్తున్నమని తెలియకుండానే దారుణంగా సెల్ఫీలు అడుగుతూ సభ్య సమాజం తలదించుకునేలా చూస్తున్నారు . ప్రస్తుతం రాజమౌళి - మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడు . ఈ సినిమా కంప్లీట్ అవ్వగానే ఆయన డ్రీం ప్రాజెక్ట్ తెరకెక్కించబోతున్నాడు. ఇదే న్యూస్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది..!!