
ఎన్టీఆర్, త్రివిక్రమ్ మధ్య సెట్ అయ్యే సమయానికి మాస్ ఫెస్టివల్ .. త్రివిక్రమ్ – ఎన్టీఆర్ కాంబినేషన్ అంటేనే అభిమానులకు ఓ పండుగ వాతావరణం. ‘అరవింద సమేత’ వంటి హిట్ తర్వాత మళ్ళీ వీరిద్దరూ కలవడం పట్ల భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని, సెట్స్ ఎప్పుడు వేస్తారు అన్నదే ఆసక్తికర అంశంగా మారింది. నాగవంశి స్పష్టం చేశారు: "త్రివిక్రమ్ కథ చెప్పగానే ఎన్టీఆర్ వెంటనే ఓకే చేశాడు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కుతుంది. కేవలం తెలుగులోనే కాదు.. హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదల చేస్తాం. వర్క్ స్టేటస్: ప్రస్తుతం స్క్రిప్ట్ లాక్ అయింది .. ప్రీ ప్రొడక్షన్ దశలో భారీ పనులు జరుగుతున్నాయి.. ఎన్టీఆర్ ‘వార్ 2’ పూర్తి చేసిన తర్వాత సెట్స్ పైకి వస్తారు .. త్రివిక్రమ్ తన కెరీర్‌లో తొలిసారి మైథలాజికల్ జానర్‌ని టచ్ చేయబోతున్నారు.
ఇక ఈ ప్రాజెక్ట్ గురించి నాగవంశీ ఇలా తెలిపారు: "సీనియర్ ఎన్టీఆర్‌ను రాముడిగా, కృష్ణుడిగా చూశాం. ఇప్పుడు తారక్‌ను అలా చూపించనున్నాం. ఇది పూర్తిగా పౌరాణిక నేపథ్యంతో వస్తుంది. రామాయణ సినిమా ప్రకటన తర్వాత దేశమంతా దాని గురించి మాట్లాడుకుంది. దానికంటే గ్రాండ్‌గా మా మూవీ ప్రకటన ఉండాలి అనిపించింది. అందుకే కొన్ని రోజులు వెనక్కు వేశాం. ప్రీ-ప్రొడక్షన్ కొనసాగుతోంది. వచ్చే ఏడాది మధ్యలో షూటింగ్ మొదలవుతుంది. అలాగే త్రివిక్రమ్ ప్రస్తుతం వెంకటేశ్ తో సినిమా ప్రారంభించనున్నారని, అది పూర్తయ్యాకే ఎన్టీఆర్ మూవీ సెట్స్ పైకి వస్తుందని వెల్లడించారు. అలాగే ఇందులో మరో స్టార్ హీరోను కూడా తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ భారీ మల్టీస్టారర్‌కి టైటిల్ ఏంటి? హీరోయిన్ ఎవరౌతుంది ? అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు!