
ఈ సినిమాలో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురు హీరోయిన్స్ అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో ఒక సీనియర్ బ్యూటికి ఛాన్స్ ఇచ్చాడట అట్లీ . ఆమె మరి ఎవరో కాదు స్టార్ సీనియర్ హీరోయిన్ "రమ్యకృష్ణ". అయితే రమ్యకృష్ణ ఈ సినిమాలో లేడీ విలన్ గా నటించబోతుందట . నెగిటివ్ షేడ్శ్ ఉన్న పాత్రలో కనిపించబోతుందట . గతంలో బాహుబలి సినిమాలో "శివగామి దేవి" పాత్ర ఎలా పాజిటివ్ నేచర్ కలిగిన నెగిటివ్ షేడ్శ్ ఉంటాయో సేమ్ ఈ సినిమాలో కూడా అలాగే ఉండబోతుందట .
రమ్యకృష్ణ ఈ మధ్యకాలంలో తెరపై కనిపించలేదు . సినిమాలకి సైన్ చేయడం లేదు. అయితే డైరెక్టర్ అట్లీ ఇంటికి వెళ్లి మరి కథ వినిపించగానే ఓకే చేసిందట. త్వరలోనే షూటింగ్ సెట్స్ లో కూడా జాయిన్ కాబోతుందట . సోషల్ మీడియాలో ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. గతంలో రాజమౌళి బాహుబలి సినిమా కోసం శివగామి దేవి పాత్ర కోసం ఎంతోమంది ని అప్రోచ్ అయ్యారు. చాలా మంది ఆ పాత్రను రిజెక్ట్ చేయడం .. కొంతమంది రాజమౌళి స్థాయికి రిచ్ కాకపోవడంతో చాలా టైం తీసుకున్నారు. ఫైనల్లీ ఆ పాత్రకి రమ్యకృష్ణ సెలెక్ట్ అయ్యింది. ఈ సినిమాలో హీరోయిన్స్ కి మించిన రేంజ్ లో ఆమె నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు అట్లీ సినిమాతో కూడా అదే హిట్ అందుకోబోతుంది అంటూ ఫ్యాన్స్ కాన్ ఫిడెంట్ గా ఉన్నారు..!