
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా మరో ఐదు రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 90 శాతానికి పైగా థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన నైట్ షోల గురించి నిర్మాత ఏఎం రత్నం కీలక అప్డేట్స్ ఇచ్చారు. అభిమానులు ముందురోజు నైట్ షోలు అడుగుతున్నారని ఆయన కామెంట్లు చేశారు.
ఆ విధంగా ఉండే అవకాశం ఐతే ఉందని నిర్మాత చెప్పుకొచ్చారు. ఈ సినిమాకు సంబంధించి తెలంగాణాలో టికెట్ రేట్ల పెంపు కోసం ప్రయత్నిస్తున్నామని ఆయన వెల్లడించారు. హరిహర వీరమల్లు చారిత్రాత్మక సినిమా కావడంతో టికెట్ రేట్ల పెంపు వచ్చే అవకాశం ఉందని నిర్మాత ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సినిమాకు టికెట్ రేట్ల పెంపు ఏ స్థాయిలో ఉంటుందో చూడాల్సి ఉంది.
అన్ని అనుమతులు లభించి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటే హరిహర వీరమల్లు సృష్టించే సంచలనాలు అన్నీఇన్నీ కావు. చాల గ్యాప్ తర్వాత పవన్ నటించిన సినిమా కావడంతో ఫ్యాన్స్ సైతం ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. హరిహర వీరమల్లు సినిమా 250 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కగా ఈ సినిమా ఓటీటీ హక్కులు సైతం ఒకింత భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని తెలుస్తోంది.
హరిహర వీరమల్లు సినిమా కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. హరిహర వీరమల్లు సినిమాలో నిధి అగర్వాల్ పంచమి అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా నుంచి మరో ట్రైలర్ రిలీజైతే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తుండగా ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. సినిమా సినిమాకు పవన్ కళ్యాణ్ రేంజ్ ఊహించని స్థాయిలో పెరుగుతోంది. పవన్ కళ్యాణ్ పారితోషికం సైతం ఒకింత భారీ స్థాయిలోనే ఉందని తెలుస్తోంది. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి