యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మొట్ట మొదటి సారి తన కెరియర్లో హిందీలో వార్ 2 అనే సినిమాలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో తారక్ తో పాటు బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ కూడా నటించాడు. కియార అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. కొన్ని రోజుల క్రితం తారక్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన టీజర్ను విడుదల చేసింది. ఈ మూవీ టీజర్ కు నార్త్ ఏరియా నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇక తెలుగు ప్రేక్షకుల నుండి ఈ మూవీ కి పర్వాలేదు అనే స్థాయి రెస్పాన్స్ లభించింది.

మూవీ టీజర్ కు రెస్పాన్స్ పెద్దగా లభించకపోయినా ఈ మూవీ టీజర్ యూట్యూబ్ లో చాలా గంటల పాటు ట్రేండింగ్ లో కొనసాగి అద్భుతమైన రికార్డును మాత్రం సొంతం చేసుకుంది. ఈ మూవీ ని ఆగస్టు 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కేవలం ఈ మూవీ బృందం తారక్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్ను మినహాయిస్తే మళ్లీ పెద్దగా అప్డేట్లను ఏమి విడుదల చేయడం లేదు. దానితో తారక్ అభిమానులు కాస్త టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ మూవీ పై నార్త్ ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్న తెలుగు ఆడియన్స్ లో పర్వాలేదు అనే స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలు కాస్త తార స్థాయికి చేరాలి అంటే ఈ మూవీ నుండి ట్రైలర్ విడుదల కావాల్సింది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మూవీ నుండి ట్రైలర్ను విడుదల చేశాక ఆ ట్రైలర్ అదిరిపోయే రేంజ్ లో ఉన్నట్లు అయితే ఈ సినిమాపై ఒక్క సారిగా అంచనాలు పీక్స్ లోకి వెళతాయి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతానికి మాత్రం ఈ మూవీ ట్రైలర్ను ఎప్పుడు విడుదల చేస్తారు అనే దానిపై మాత్రం పెద్దగా క్లారిటీ లేకుండా పోయింది. మరి తారక్ నటించిన మొట్ట మొదటి హిందీ సినిమాతో ఆయన ఎలాంటి విజయాన్ని , ఏ స్థాయి గుర్తింపును దక్కించుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: