ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు సినిమా మరి కొన్ని గంటల్లో మన ముందుకు రాబోతోంది. ఇదే తరుణంలో ఈ సినిమాకు సంబంధించి కొన్ని రివ్యూలు బయటకు వచ్చాయి. అయితే తాజాగా హరిహర వీరమల్లు సినిమా గురించి యూట్యూబర్ నా అన్వేషణ అన్వేష్ పెట్టిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.. సౌతాఫ్రికాలో ఈ చిత్రం చూసానని బాలయ్య శ్రీకృష్ణదేవరాయలుగా చేశారంటూ, డైమండ్ కోసం ఔరంగజేబుతో పోరాటం అంటూ చెప్పుకొచ్చారు..మరి నా అన్వేషణ యూట్యూబర్ చెప్పింది నిజమేనా? అసలు సినిమా సౌతాఫ్రికాలో రిలీజ్ అయిందా అనే వివరాలు  చూద్దాం.. ఇక స్టోరీ విషయానికి వస్తే.. హరిహర వీరమల్లు సినిమా సూపర్ హిట్ డూపర్ హిట్.. ఇప్పుడు నేను సౌతఫ్రికాలో చిత్రాన్ని చూసాను అదిరిపోయింది.

 ఇందులో పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అద్భుతం అని చెప్పవచ్చు.. 11వ శతాబ్దం హరిహర రాయలు, బుక్కరాయలు, కాకతీయ సామ్రాజ్యం గురించే ఈ కథ ఉందని చెప్పారు. ముఖ్యంగా కాకతీయ సామ్రాజ్యం కోల్పోయిన తర్వాత కొత్త సామ్రాజ్యం ఏర్పడడం కోసం తిరుగుతున్న టైంలో సామ్రాజ్యంలో చేరి ఆ తర్వాత విజయనగర సామ్రాజ్యం ఏర్పరుస్తారు. వాళ్లకి పుట్టిన కొడుకే హరి హర వీరమల్లు అంటూ చెప్పుకొచ్చారు.. అంతే కాదు ఈ చిత్రంలో బాలకృష్ణ కూడా ఉన్నారు.. హరిహర వీరమల్లు మనవడిగా శ్రీకృష్ణదేవరాయల పాత్రలో ఆయన ఎంట్రీ చాలా బాగుందని, ఆయన వస్తుంటే ప్రేక్షకులకు గూస్బంస్ వస్తాయని చెప్పుకొచ్చారు. ఒక అద్భుతమైన సినిమా అంటూ నా అన్వేషణ అన్వేష్ రివ్యూ  ఇచ్చాడు..కానీ చివరికి అందరికీ ఒక ట్విస్ట్ ఇచ్చాడు.. నిజానికి నేను చెప్పింది రివ్యూ కాదు.. ఫేక్ రివ్యూ ఇచ్చే వారికి ఇదొక చెంపపెట్టు..

 అసలు హరిహర వీరమల్లు సినిమాలో బాలకృష్ణ ఉండడం అనేది అసాధ్యం.. సినిమానే రిలీజ్ కాలేదు.. అలాంటప్పుడు సినిమా కథ గురించి చెప్పేవన్నీ అబద్ధాలే.. ప్రస్తుతం చాలామంది ప్రజలను తప్పుదారి పట్టిస్తూ ఇలా ఫేక్ రివ్యూ ఇస్తున్నారంటూ అన్వేష్ చెప్పుకొచ్చారు.. ఇలా రివ్యూలు ఇచ్చేవాడు రేపు పెళ్లి చేసుకుంటాడు, వాడి పెళ్ళాం మీద మరొకడు వచ్చి ఈ విధంగానే రివ్యూ ఇస్తే కాపురం చేస్తాడా.. ఒక తల్లి 9 నెలలు కడుపులో మోసి బిడ్డని కంటుంది. ఇంకా కళ్ళు తెరవక ముందే చేతులు, కాళ్లు వంకరగా ఉన్నాయని చెబితే ఎలా అంటూ కోపానికి వచ్చాడు. ఇలా చెత్త రివ్యూల వల్ల నిర్మాతలు ఎంతో నష్టపోతున్నారని సినిమా కోసం వేలాది మంది పనిచేస్తారు అంటూ  ఫేక్ రివ్యూలు ఇచ్చే వారికి గట్టి కౌంటర్ ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: