ఇప్పుడు ఎక్కడ చూసినా సరే హీరోయిన్ సమంత - డైరెక్టర్ రాజ్ నిడమూరు మధ్య ఉన్న ప్రేమాయణం గురించి మాట్లాడుకుంటున్నారు జనాలు.  అది టాలీవుడ్ కాదు కోలీవుడ్ కాదు బాలీవుడ్ కాదు.. కొన్ని నేషనల్ మీడియాలో కూడా సమంత రాజ్ నిడమూరు రిలేషన్షిప్ పై వార్తలు వినిపిస్తున్నాయి . దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. కాగా హీరోయిన్ సమంత - నాగచైతన్యను ప్రేమించి  పెళ్లి చేసుకుని ఆ తర్వాత కొన్ని కారణాలు చేత విడాకులు తీసుకుంది.  అయితే ఆమె విడాకులు తీసుకున్న మూమెంట్లో మాట్లాడిన మాటలు ఆమె రెండో పెళ్లి చేసుకోనే చేసుకోరు అన్న విధంగా అభిమానులకు నమ్మకం కలిగించాయి .


సడన్గా ఏమైందో ఏమో తెలియదు కానీ సమంత - రాజ్ నిడమూరుకి దగ్గరవుతూ తన బాధలు మొత్తం మర్చిపోయింది అన్నట్లు బిహేవ్ చేసింది . ఇంకా పక్కాగా చెప్పాలి అంటే పరోక్షకంగానే ఆయనతో ప్రేమాయణం కొనసాగిస్తున్నాను అంటూ కొన్ని ఫోటోలు ద్వారా బయటపెట్టింది . ఈ మధ్యకాలంలో సమంత - రాజ్  ఎక్కడికి వెళుతున్నా సరే కలిసి తిరుగుతున్నారు . చట్టాపట్టాలేసుకొని తెగ ఎంజాయ్ చేస్తున్నారు.  దానికి తగ్గట్టు రాజ్ నిడమూరు భార్య పెట్టే పోస్ట్లు కూడా కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండటంతో సమంత - రాజ్ నిడమూరు మధ్య ప్రేమాయణం కన్ఫామ్ అయిపోయింది.



త్వరలోనే వీళ్లు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి . అయితే వీళ్ళిద్దరూ కలవడానికి అసలు కారణమెవ్వరు ..? వీళ్లిద్దరికీ అసలు ఎలా రిలేషన్స్ స్టార్ట్ అయ్యింది..? వీళ్ళిద్దరూ అసలు కలిసి ఉండగలరా..? అనే విషయాలు ఎక్కువగా చర్చించుకుంటున్నారు జనాలు . కాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది జనాలు వీళ్ళందరూ కలవడానికి కారణం ఒక బడా హీరో అంటూ మాట్లాడుకుంటున్నారు . ఆ హీరో సమంతకి చాలా చాలా దగ్గర ఫ్రెండ్ . ఇక రాజ్ నిడమూరు డైరెక్షన్ లో ఈ హీరో సినిమాలు చేశాడు. అలా కామన్ ఫ్రెండ్ ద్వారా వీళ్ళిద్దరూ కలిసి ఫ్రెండ్షిప్ చేయగా అదికాస్త ప్రేమాయణం గా మారింది అంటూ మాట్లాడుకుంటున్నారు.  ఇప్పటికీ వీళ్లిద్దరి మధ్య బ్రోకర్ లా కొన్ని కొన్ని పనులను సెట్ చేస్తున్నాడు ఈ హీరో అంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ఎక్కడికైనా వీళ్ళు ట్రిప్స్  వెళ్లాలి అన్న కూడా ఆ హీరోనే ప్లాన్ చేస్తున్నాడట . చూడాలి మరి ఫ్రెండ్షిప్ అంటూ స్టార్ట్ చేసి ప్రేమాయణం వరకు తీసుకొచ్చిన ఈ హీరో దానిని ఎలా పెళ్లి బంధంగా మార్చి భార్యాభర్తలుగా సమంత - రాజ్ ని మారుస్తారో...???

మరింత సమాచారం తెలుసుకోండి: