టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో నిధి అగర్వాల్ ఒకరు కాగా హరిహర వీరమల్లు సినిమాతో ఈ బ్యూటీ అదృష్టాన్ని పరీక్షించుకోగా ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే. ఈ సినిమా నిర్మాతలకు భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చింది. పవన్ మేనరిజం 100 డైలాగ్ లతో సమానం అంటూ నిధి అగర్వాల్ కామెంట్ చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

నిధి అగర్వాల్ తాజాగా కాకినాడలో సందడి చేసిన సంగతి తెలిసిందే.  కాకినాడలోని దేవాలయ వీధిలో ఏర్పాటు చేసిన ఒక జ్యువెలరీ షోరూమ్ ప్రారంభోత్సవానికి ఆమె అతిథిగా హాజరయ్యారు.  నిధి అగర్వాల్ వచ్చిందని తెలిసి భారీ సంఖ్యలో అభిమానులు ఆమెను చూడటానికి వచ్చారు.  భారీ సంఖ్యలో వచ్చిన అభిమానులను చూసిన నిధి అగర్వాల్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

అభిమానులను చూసిన ఆనందంలో నిధి అగర్వాల్ డాన్స్ చేశారు.  ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ మేనరిజంను రిపీట్ చేశారు.  నిధి అగర్వాల్  ప్రస్తుతం ది  రాజాసాబ్ సినిమాలో నటిస్తున్న  సంగతి తెలిసిందే.  నిధి అగర్వాల్ కెరీర్ ప్లాన్స్  ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. నిధి అగర్వాల్ లుక్స్ విషయంలో ఎంతో కేర్ తీసుకుంటున్నారు.

సవ్యసాచి సినిమాతో నిధి అగర్వాల్ కెరీర్ మొదలు కాగా  నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో క్రేజ్ పెంచుకుంటున్నారు. నిధి అగర్వాల్ వయస్సు 31 సంవత్సరాలు కాగా నిధి అగర్వాల్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకోవాలని  ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.  నిధి అగర్వాల్ ఇతర భాషల్లో సైతం సత్తా చాటాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: