
మరి ఏ సినిమా హిట్ అవుతుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. సోషల్ మీడియాలో ఈ రెండు సినిమాల గురించి టాక్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. అయితే వార్ 2 సినిమాను కూలీతో పోలిస్తే, అది ఒక్క అడుగు వెనకబడి ఉందన్న టాక్ వినిపించింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయిన తర్వాత, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ అలర్ట్ అయ్యారు. అంతకుముందు వరకు డీసెంట్‌గా కొనసాగిన బుకింగ్స్, తెలుగు రాష్ట్రాల్లో ఓపెన్ అయిన తర్వాత, ఎన్టీఆర్ తన పవర్ చూపించాడు. గంట గంటకు ట్రెండింగ్ లెక్కలు పూర్తిగా మారిపోయాయి. సినిమా రిలీజ్ అవుతున్న ప్రతి థియేటర్‌లోనూ ఆల్మోస్ట్ అన్ని బుకింగ్స్ కంప్లీట్ అయ్యాయి.
"ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్ పవర్… ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్ శక్తి… ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్ రేంజ్" అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. ఎన్టీఆర్ ఫ్యాక్టర్ ఈ సినిమాపై బాగా ప్రభావం చూపించబోతుందని అంటున్నారు సినీ ప్రముఖులు. దీంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో "నా ఫ్యాన్స్ ఉండగా నన్ను ఎవ్వరు ఆపలేరు అని తారక్ అన్న మాటే నిజమైంది" అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాకు ప్రీతమ్ సంగీతం అందించగా, యాష్ రాజ్ ఫిలిమ్స్ వారు నిర్మించారు. అయాన్ ముఖర్జీ ఈ సినిమాకు దర్శకుడిగా పని చేశారు.మరికొద్ది గంటల్లోనే ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ఎటువంటి టాక్ సంపాదించుకుంటుందో అనేది బిగ్ హాట్ టాపిక్‌గా మారింది..!!