సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ తెర‌కెక్కించిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `కూలీ` విడుద‌ల‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. రేపు ఈ చిత్రం వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. టాలీవుడ్ కింగ్ నాగార్జున విలన్ గా న‌టించ‌డంతో తెలుగులోనూ కూలీకి భారీ హైప్ ఏర్ప‌డింది. ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, శ్రుతి హాసన్, రెబా మోనికా జాన్, అమీర్ ఖాన్ త‌దిత‌రులు ఈ చిత్రంలో భాగం అయ్యారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించ‌గా.. కళానిధి మారన్ నిర్మాత‌గా వ్య‌హ‌రించారు.


రిలీజ్‌కు ఇంకా ఒక్క రోజే ఉండ‌టంతో తలైవా అభిమానుల సందడి మొదలైంది. పోటీగా వార్ 2 ఉన్న‌ప్ప‌టికీ.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో రజనీకాంత్ సినిమా దుమ్ము లేపుతోంది. ఇక‌పోతే మాసివ్ క్రేజ్ నడుమ కూలీ మూవీ వరల్డ్ వైడ్ గా ఎక్స్ లెంట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది. తెలుగులో కూలీ మూవీకి రూ. 45 కోట్ల రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌ర‌గ‌గా.. బ్రేక్ ఈవెన్ కోసం రూ. 46 కోట్లకు పైగా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


అలాగే త‌మిళంలో ర‌జ‌నీకాంత్ చిత్రానికి రూ. 120 కోట్ల రేంజ్‌లో బిజినెస్ జ‌రిగింది. వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 305 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుని సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. దీంతో ఇప్పుడు కూలీ ఎదుట కొండంట టార్గెట్ వ‌చ్చి ప‌డింది. సినిమా క్లీన్ హిట్ కావాలంటే ఫుల్ ర‌న్‌లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా  రూ. 307 కోట్లకు పైగా షేర్, రూ. 600 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని ట‌చ్ చేయాల్సి ఉంటుంది. మ‌రి ఇంత బిగ్ టార్గెట్ ను అది కూడా వార్‌2తో పోటీ పడుతూ అందుకోవాలంటే టాక్ పాజిటివ్‌గా రావాల్సిన అవ‌స‌రం క‌చ్చితంగా ఉంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: