గుడిలోకి వెళ్తే పూజారి ఏ విధంగా ఉంటారో, ఏదైనా ఈవెంట్ జరగాలంటే తప్పకుండా  యాంకర్ ఉండాల్సిందే. ఈవెంట్ మొత్తం యాంకర్ పైనే ఆధారపడి నడుస్తుంది. యాంకరింగ్ చేసేవాళ్లు ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఆ షో నడిపిస్తే ఆ ఈవెంట్ అంత సక్సెస్ అవుతుంది. టాలీవుడ్ లో అంత ఉల్లాసంగా, ఉత్సాహంగా చేసే యాంకర్లలో సుమా మొదటి స్థానంలో ఉన్నారు.  సుమ కంటే ముందు  యాంకరింగ్ అంటే చాలామందికి గుర్తుకు వచ్చే పేరు ఉదయభాను. ఈమె స్టేజ్ ఎక్కిందంటే  గలగల జలపాతం పారినట్టు మాట్లాడేది. ఆమె మాటలకు ఎంతోమంది మంత్రముగ్ధులయ్యేవారు. అలాంటి ఈ యాంకరమ్మ ఒక్కసారిగా ఇండస్ట్రీకి దూరమై మళ్లీ ఈ మధ్యకాలంలో అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. అలాంటి ఈమె తాజాగా త్రిబాణదారి బార్బరిక్ అనే చిత్రంలో  నటించింది.

 ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన యాంకరింగ్ అవకాశాలపై  కొన్ని నిజాలు బయటపెట్టింది. ఇండస్ట్రీలో ఎన్నో జరుగుతున్నాయని, కొంతమంది నాకు యాంకరింగ్ అవకాశాలు రాకుండా తొక్కేస్తున్నారని ఆరోజు నేను మాట్లాడాను.. అది ఇప్పుడు నిజం అవుతుందని ,నేను ఇండస్ట్రీలోకి రాకుండా ముందుగానే తొక్కేస్తున్నారని ఆమె తెలియజేసింది. ఇండస్ట్రీలో యాంకర్లంతా సిండికేట్ గా మారిపోయి, నేను కొన్ని ఈవెంట్లకు డేట్లు తీసుకున్న తర్వాత తీరా ఆ షో దగ్గరికి వెళ్లేసరికి  నన్ను వద్దని తిరస్కరించిన సందర్భాలు అనేకం ఉన్నాయని ఆమె అన్నది..

ఉదయభాను ఒక షో చేస్తుంది అంటే అసలు ఆమెను ఎందుకు తీసుకున్నారని, రిజెక్ట్ చేయించే వారే  ఎక్కువ మంది ఉన్నారంటూ బాధపడింది. అలాగని నేను ఏదైనా చిన్న షోలు చేద్దామంటే నాకంటే చిన్న యాంకర్లకు  అవకాశాలు తగ్గిపోతాయి. అందుకే ఏ షో పడితే అది చేయడం లేదు. ఇండస్ట్రీలో సిండికేట్ గా మారిన వాళ్లందరి బండారం బయటపెడతానని, ఆ గుట్టు విప్పితేనే యాంకర్ గా స్థిరపడాలనుకునే వారికి ఛాన్సులు దొరుకుతాయని  ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఉదయభాను మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఆమెకు కొంతమంది నెటిజెన్లు సపోర్ట్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: