గతంలో అనిరుధ్ రవిచంద్రన్ చేసిన తప్పే మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ చేశాడా..? అంటే అవును అన్న సమాధానాలు వినిపిస్తున్నాయి. మనకు తెలిసిందే, ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎక్కడ చూసినా, ఎవరు మాట్లాడినా ఒకటే మాట వింటున్నాం .. ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ అంత ఓవర్ చేశాడు? ఎందుకు అంత రెచ్చ్కొట్టేలా వార్ 2 సినిమా గురించి అంత ధీమా వ్యక్తం చేశాడు? అదే ధీమా ఈ సినిమాను కొంపముంచిందా అంటూ మాట్లాడుకుంటున్నారు. మనందరికీ తెలిసిందే, అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్ రోషన్జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన భారీ సినిమా వార్ 2. ఈ సినిమా రిలీజ్ కి ముందు ప్రమోషన్స్‌లో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు హైలైట్‌గా మారాయి.


అయితే సినిమా హిట్ అయ్యి ఉంటే, జూనియర్ ఎన్టీఆర్ మాటలు ఆయనకు సినిమాపై ఉన్న నమ్మకం, కాన్ఫిడెన్స్ అని పొగడ్తలు పడ్డేవి. కానీ జూనియర్ ఎన్టీఆర్ టైమ్ బాలీవుడ్‌లో హిట్ అయినా, తెలుగు వెర్షన్ మాత్రం ఫ్లాప్ అయింది, డిజాస్టర్ అనిపించుకుంది. జూనియర్ ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులు దక్కినా, ఆయన కథ సెలెక్షన్ విషయంలో మాత్రం నెగిటివ్ మార్కులు పడ్డాయి. ఈ క్రమంలోనే ఆయన స్టేజీపైకి వచ్చి కాలర్ ఎగరేసి మాట్లాడిన మాటలను జనాలు వ్యంగ్యంగా వైరల్ చేస్తున్నారు. కేవలం వార్ 2 మాత్రమే కాదు, గతంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఏ స్టేజీ ఈవెంట్‌లో కాలర్ ఎగరేసి “ఈ సినిమా హిట్” అంటూ హంగామా చేసినప్పుడల్లా ఆ సినిమాలు ఫ్లాప్ అయ్యాయని గుర్తు చేస్తున్నారు.



ఇకపోతే, ఇదే విధంగా గతంలో అనిరుధ్ రవిచంద్రన్ కూడా ఓవర్ యాక్టింగ్ చేసిన సంగతి గుర్తు చేస్తున్నారు. ఆయన వర్క్ చేసిన కొన్ని సినిమా రిలీజ్ సమయంలో ఫైర్ ఎమోజీలతో రచ్చ చేసేవాడు. రివ్యూలు ఇస్తూ “పక్కా హిట్” అంటూ హంగామా చేసేవాడు. కానీ ఆయన మొదలు పెట్టిన ప్రతి సినిమా ఫ్లాప్ అవుతూ వచ్చింది. దాంతో ఆయనకు మంచి పేరు రాకపోవడంతో పాటు, క్రెడిబిలిటీ కూడా దెబ్బతింది. చివరికి ఇదే తన మీద ప్రెషర్ పెంచేస్తుందని గ్రహించి, అలాంటి రివ్యూలు ఇవ్వడాన్ని ఆయన ఆపేశాడు. అనిరుధ్‌కి ఎదురైన అనుభవం ఇప్పుడు ఎన్టీఆర్‌కూ ఎదురైందని జనాలు ట్రోల్ చేస్తున్నారు. ఇకపై ఆయన కాలర్ ఎగరేయాలంటే ముందుగా ఆలోచించుకోవాలని కొందరు వ్యంగ్యంగా కామెంట్ చేస్తున్నారు. తారక్‌ ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే, తప్పకుండా ఒక సాలిడ్ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: