చాలామందికి చివరి కోరిక అనేది కచ్చితంగా ఉంటుంది.అలా అక్కినేని నాగేశ్వరరావుకి కూడా చివరి కోరిక ఉండేదట.ఆ చివరి కోరికను కొడుకుగా నాగార్జున నెరవేర్చారని తాజాగా జయమ్ము నిశ్చయమ్మురా  షోలో బయటపెట్టారు. మరి ఇంతకీ నాగేశ్వరరావుకు ఉన్న చివరి కోరిక ఏంటి.. ఐసి బెడ్ మీద పడుకొని మరీ ఆ పని చేశారా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. అక్కినేని ఫ్యామిలీ మొత్తం కలిసి నటించిన ఒకే ఒక్క సినిమా మనం అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో నాగార్జున, అమల,అక్కినేని నాగేశ్వరరావు,నాగచైతన్య, సమంత, అఖిల్ ఇలా కుటుంబం మొత్తం నటించింది. అయితే ఈ సినిమానే అక్కినేని నాగేశ్వరరావుకి చివరి సినిమా అనే సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ సినిమా సమయంలో నే నాగేశ్వరరావుకు క్యాన్సర్ ఉందని, అది చివరి స్టేజిలో ఉంది అనే విషయం బయటపడిందట.

ఇక ఈ విషయం గురించి నాగార్జున జయమ్ము నిశ్చయమ్మురా షోలో మాట్లాడుతూ..మనం సినిమా టైంలో నాన్నకు చివరి రోజులని మాకు ముందే తెలిసిపోయింది.దాంతో ఆయనను హ్యాపీగా ఉంచడానికి ఎన్నో పనులు చేశాం. ఇక సినిమా షూటింగ్ అయిపోయాక నాన్నకి ఇంట్లోనే ఐసియూ బెడ్ అరేంజ్ చేసి ఉంచాము.కానీ నాన్న ఆ సమయంలో తన చివరి కోరిక ఏంటో చెప్పారు. అదే ఈ సినిమాలో తనకు తానే డబ్బింగ్ చెప్పుకుంటానని,తన వాయిస్ కి వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పడం ఇష్టం లేదని, నేనే డబ్బింగ్ చెప్పుకుంటానని పట్టు పట్టారు. అయితే ఐసియూ బెడ్ మీద ఉన్న ఆయన ఈ పని చేయగలరా అని అనిపించింది. కానీ నాన్న మాత్రం వేరే వాళ్ళతో డబ్బింగ్ చెప్పిస్తే బాగుండదని వార్నింగ్ ఇవ్వడంతో చివరికి నాన్నతోనే ఆయన పాత్రకి డబ్బింగ్ చెప్పించాము. కానీ ఐసియూ బెడ్ మీద ఉన్నా కూడా నాన్న తన పాత్ర మొత్తానికి డబ్బింగ్ చెప్పడం నిజంగా గ్రేట్.

ఆయనకు సినిమాల మీద ఉండే డెడికేషన్ ఎలాంటిదో ఈ ఒక్క సందర్భంతో అర్థం చేసుకోవచ్చు. నాకు జీవితంలో పెద్దగా ఇబ్బందులు పడిన సందర్భాలు లేవు.అలాగే దేని గురించి కూడా ఒత్తిడిగా ఫీల్ అవ్వలేదు. కానీ ఈ సినిమా షూటింగ్ సమయంలోనే చాలా రాత్రులు నిద్ర కూడా పట్టలేదు.ఏం జరుగుతుందో అనే బాధే నాలో ఉంది.ఇక ఫైనల్ గా మా నాన్న తన పాత్ర మొత్తానికి డబ్బింగ్ చెప్పుకున్నారు.ఇక సినిమా అవుట్ పుట్ మొత్తం ఆయనకి చూపిస్తే చాలా బాగుందిరా అని చెప్పారు అంటూ నాగార్జున తన తండ్రి చివరి కోరిక ఏంటో బయటపెట్టారు. అలాగే తన తండ్రి చివరి కోరిక కూడా తీర్చినట్టు తెలిపారు. ఇక అక్కినేని ఫ్యామిలీ మొత్తం నటించిన మనం సినిమాని నాగేశ్వరరావు చూడకుండానే చనిపోయారు. ఎందుకంటే ఈయన 2014 జనవరి 22న చనిపోతే ఈ సినిమా 2014 మే 23న రిలీజ్ అయింది

మరింత సమాచారం తెలుసుకోండి: