
ఇటీవలి కాలంలో సినిమా థియేటర్లలో సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూకపోవడానికి చాలా కారణాలే ఉన్నాయి. భారీగా పెరిగిన టికెట్ ధరలు, అలాగే త్వరగా ఓటీటీలో సినిమాలు రిలీజ్ అవుతాయని అక్కడ చూద్దాంలే అన్న ధోరణికి వచ్చేశారు. గతంలో పెద్ద సినిమాకు మిక్స్ టాక్ వచ్చినా కనీసం రెండు వారాల పాటు బాగానే కలెక్షన్లు వచ్చేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వర్కింగ్ డేస్ లో అయితే పరిస్థితి మరింత దిగజారిపోతోంది.
ప్రేక్షకులు ఇప్పుడు చాలా సెలెక్టివ్ గా మారారు. వారికి టికెట్ ధరకు తగిన క్వాలిటీ, కంటెంట్ ఉంటేనే థియేటర్‌కి వెళ్తున్నారు. లేకుంటే నేరుగా ఓటీటీలో వచ్చే వరకు వేచి చూస్తున్నారు. దీనివల్ల బిగ్ బడ్జెట్ మూవీస్ కూడా ఫస్ట్ వీకెండ్ లోపే బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. ఏదేమైనా ఇకపై టాలీవుడ్ లో పెద్ద సినిమాల విషయంలో కాంబినేషన్లు కాకుండా కథలను నమ్ముకుంటేనే ఉత్తమం.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు