
ఇప్పుడు తాజాగా ఇదే సమస్య ఒక సినిమా విషయంలో హాట్ టాపిక్ అవుతోంది. త్వరలో రిలీజ్ కానున్న ఒక మిడ్ రేంజ్ మూవీకి సంబంధించిన నటీనటులు ప్రమోషన్స్‌కి దూరంగా ఉంటున్నారట. హీరోయిన్ మరో సినిమా షూటింగ్స్‌లో బిజీగా ఉంటే, హీరో మాత్రం “విదేశాల్లో అత్యవసర పని ఉంది కాబట్టి రాలేను” అంటూ స్పష్టంగా చెప్పేశాడట. దీంతో నిర్మాతల పరిస్థితి గందరగోళంగా మారిపోయింది. దర్శకుడు కూడా “సినిమా కోసం అంత కష్టపడి డబ్బులు పెట్టాం, చివరికి ప్రమోషన్స్ లేకపోతే ప్రేక్షకుల దృష్టికి సినిమా ఎలా తీసుకెళ్తాం?” అని అడిగితే, హీరో-హీరోయిన్ వైపు నుండి మాత్రం “మా నటన భాగం పూర్తయింది. ఇప్పుడు సినిమాను ప్రమోట్ చేసుకోవడం మీ వంతు బాధ్యత” అన్న సమాధానమే వినిపించిందని తెలుస్తోంది.
ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద స్టార్ హీరోలే తమ సినిమాల కోసం రోడ్డు మీదకి దిగుతూ, మీడియా ఇంటర్వ్యూలు ఇస్తూ, పబ్లిక్ ఈవెంట్స్‌కి హాజరై ప్రమోషన్స్ చేస్తుంటారు. వాళ్ల వల్లే ప్రేక్షకుల్లో ఉత్సాహం పెరిగి, థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులు పడుతుంటాయి. అటువంటి పరిస్థితిలో ఈ చిన్న హీరో హీరోయిన్ ప్రమోషన్స్ పక్కన పెట్టేయడం చూసి, ప్రజలు ఘాటుగా స్పందిస్తున్నారు. “సినిమా రిలీజ్‌కు ముందు ప్రమోషన్స్‌కి రావడం వీళ్లకి ఇష్టం ఉండదు. కానీ సినిమా హిట్ అయితే మాత్రం సోషల్ మీడియాలో పెద్ద పెద్ద పోస్టులు పెడతారు. సక్సెస్ పార్టీకి డ్రెస్‌అప్ అయి కెమెరాల ముందు మెరిసిపోతారు. అంతా అప్పుడు గుర్తొస్తుంది కానీ, అవసరం ఉన్నప్పుడు మాత్రం తప్పించుకుంటారా?” అంటూ సినీ లవర్స్ మండిపడుతున్నారు.
ఇప్పుడీ ఇష్యూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతోంది. “సినిమా అనేది ఒక్కరి కష్టం కాదు, అందరి కష్టం. ప్రమోషన్స్ కూడా సినిమాలో భాగమే. ప్రేక్షకుల ముందు సినిమా తీసుకెళ్లే బాధ్యతను హీరో, హీరోయిన్ పంచుకోకపోతే మిగతా వారి కష్టం వృథా అవుతుంది” అంటూ చాలా మంది నెటిజన్లు చురకలు వేస్తున్నారు.