విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన కింగ్డమ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోలేకపోయింది. తొలి వారాంతం వరకు బాగానే వసూళ్లు సాధించిన ఈ సినిమా ఆ తర్వాత పూర్తిగా చతికిలపడింది. దీంతో నాలుగు వారాలకే ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది. ఈ నెల 27వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది.

సాధారణంగా పెద్ద సినిమాలు ఓటీటీలోకి రావడానికి ఎక్కువ సమయం పడుతుంది. కానీ కింగ్డమ్ మాత్రం త్వరగానే రావడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా ఐదు భాషల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. హిందీలో సామ్రాజ్య పేరుతో అందుబాటులోకి వస్తుంది. థియేటర్లలో సక్సెస్ కాని ఈ సినిమా ఓటీటీలోనైనా కచ్చితంగా సక్సెస్ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

వరుస  ప్లాప్స్  విజయ్ దేవరకొండ కెరీర్ పై తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతున్నాయి.  విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ పై  కూడా ఈ ప్రభావం పడే ఛాన్స్ ఉంది.  విజయ్ దేవరకొండ ప్రస్తుతం రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్ లో నటిస్తున్నారు.  విజయ్ దేవరకొండను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ  పెరుగుతోంది. విజయ్  బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేయాలనీ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

విజయ్ దేవరకొండ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను  ఎంచుకుంటే మాత్రమే కెరీర్ పరంగా మరిన్ని విజయాలను ఖాతాలో వేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి.  విజయ్ దేవరకొండ లుక్స్ విషయంలో   మరింత కేర్ తీసుకోవాల్సిన అవసరం ఐతే ఉందని అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. విజయ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తారేమో చుడాల్సి ఉంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు
 

మరింత సమాచారం తెలుసుకోండి: