ఇది నిజంగా కొరటాల శివ అభిమానులకు వెరీ గుడ్ న్యూస్‌ అనే చెప్పాలి. కొరటాల శివ అంటే నెగిటివిటీ లేని డైరెక్టర్ అని అంతా మాట్లాడుకుంటూ ఉంటారు. మరికొందరు అపజయం ఎరుగని డైరెక్టర్ అని ఓ రేంజ్‌లో ప్రశంసిస్తారు. ఇదంతా ఆచార్య సినిమా ముందు వరకే. ఆచార్య సినిమా టైంలో కొరటాల శివపై జరిగిన ట్రోలింగ్ అంతా ఇంతా కాదు. కొందరైతే ఏకంగా ఇక కొరటాల శివ ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోవచ్చు అంటూ ఘాటుగా ట్రోల్ చేశారు. దానికి బిగ్ కారణం ఆచార్య సినిమా అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ సినిమా సమయంలో చిరంజీవికి, మెగా ఫ్యామిలీకి, అలాగే కొరటాల శివకి మధ్య ఏవో కొన్ని క్లాష్‌లు వచ్చాయని వార్తలు వినిపించాయి. కొరటాల శివ చెప్పిన డైరెక్షన్ మెగా ఫ్యామిలీకి నచ్చకపోవడంతో చిరంజీవి - రామ్‌చరణ్ తమకిష్టమైన విధంగా సినిమా షూటింగ్ డైరెక్ట్ చేశారని.. అందుకే కొన్ని సీన్లు తెరపై పేలవంగా కనపడ్డాయని అప్పట్లో జనాలు మాట్లాడుకున్నారు.

దానికి తగ్గట్టే ఆచార్య సినిమా తరువాత ఎక్కడా కూడా కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్ కలిసిన సందర్భాలు కనిపించకపోవడంతో వీళ్ల మధ్య ఇష్యూస్ ఉన్నాయనే వార్తలు నిజమని జనాలు నమ్మేశారు. పైగా, మెగా ఫ్యామిలీ హీరోలు ఎవరూ కూడా ఇకపై కొరటాల శివతో సినిమా చేయరనే  వార్త వైరల్ అయింది. అయితే, ఇన్నాళ్లకి మళ్లీ ఇప్పుడు కొరటాల శివ, మెగా ఫ్యామిలీ హీరోలు కలిసిపోయారనే వార్త ట్రెండ్ అవుతోంది. ఆచార్య సినిమా తర్వాత కొరటాల శివ ఎప్పుడూ మెగా ఫ్యామిలీతో కలిసిన మూమెంట్స్ కనిపించలేదు. దీంతో వీళ్ల మధ్య విభేదాలు  ఉన్నాయనిపించింది. కానీ ఇప్పుడు రీసెంట్‌గా కొరటాల శివ, చిరంజీవి కలిసినట్లు ఓ న్యూస్ టాలీవుడ్‌లో ట్రెండ్ అవుతోంది.

వీళ్ల మీటింగ్ మెగా హీరో సినిమా కోసం కాదు. హీరో నాగచైతన్యతో డిస్కషన్ కోసం అని సినీ వర్గాలు చెబుతున్నాయి. కొరటాల శివ "దేవర" పూర్తి చేసిన తర్వాత నాగచైతన్యతో సినిమా ప్లాన్ చేస్తున్నాడని వార్త బాగా వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే నాగార్జున, నాగచైతన్య మీటింగ్ సమయంలో అక్కడే ఉన్న మెగాస్టార్ చిరంజీవిని కూడా కొరటాల శివ కలిసాడని న్యూస్ బయటకి వచ్చింది. దాంతో మళ్లీ వాళ్ల మధ్య ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయ్యిందని సోషల్ మీడియాలో హడావిడి మొదలైంది. ఇండస్ట్రీలో చిన్న చిన్న గొడవలు కామన్‌ .. అవి అందరికీ ఉండేవే. కానీ ఇలా సర్దుకుపోవడం చాలా మంచిదని, మెగాస్టార్‌తో కొరటాల శివ కలిసిన విషయం చాలా బాగుందని జనాలు అప్రిషియేట్ చేస్తున్నారు. మళ్లీ వీళ్ల కాంబినేషన్‌లో మరో సినిమా వస్తుందేమోనని అభిమానులు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు..!?

మరింత సమాచారం తెలుసుకోండి: