సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నారు. బిగ్ బడా పాన్ ఇండియా స్టార్‌లు కూడా ఉన్నారు. కానీ అందరిలో హైయెస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో ఎవరు అని అడిగితే..అందరి నోట వినిపించే మాట..వచ్చే ఒకే ఒక్కే రిప్లై "పవర్ స్టార్ పవన్ కళ్యాణ్". అసలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఇంత క్రేజ్ ఎందుకు వచ్చింది అనేది చాలాసార్లు ఆశ్చర్యం గా అనిపిస్తుంది. ఆయన కూడా ఇతర హీరోల్లా స్టైలిష్‌గా ఉంటాడు, బాగా డాన్స్ చేస్తాడు, డైలాగ్స్ చెప్తాడు. కానీ మిగతా హీరోల కంటే ఆయనకు అభిమానుల్లో అంత పెద్ద హైపర్ క్రేజ్ ఎందుకు ఉందో చాలా మంది అర్థం చేసుకోలేరు.


ప్రేక్షకులు పవన్ కళ్యాణ్ ను కేవలం హీరోగా కాకుండా, ఒక దేవుడి రూపంలోనే అభిమానిస్తారు. ఇదే కారణం ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరగడానికి అని చాలా మంది చెప్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ కూడా అభిమానులను అలాగే స్నేహపూర్వకంగా, సొంత ఇంటి సభ్యుల్లా ట్రీట్ చేస్తారు. దానికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. రేపు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కావడంతో, అభిమానులు ఆయనకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ వీడియోలను ఎడిట్ చేసి, సోషల్ మీడియాలో రచ్చ రంబోలా చేయిస్తున్నారు. వీటిలో ఒక వీడియో ప్రత్యేకంగా హైలైట్ గా మారింది. ఆ వీడియోలో పవన్ కళ్యాణ్ సరదాగా నవ్వుతూ, అభిమానులకు కౌంటర్ వేస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఒక ఫ్యాన్ “హ్యాపీ బర్త్‌డే పవన్ కళ్యాణ్” అని చెప్పగానే, ఆయన “నేను మర్చిపోయాను, మీరు మర్చిపోయేలాలేరుగా?” అని సరదాగా నవ్వి, తన మార్క్ స్టైల్ చూపించారు.



ఈ స్పెషల్ గూస్ బంప్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ వీడియోని విపరీతంగా షేర్ చేస్తున్నారు. వీడియోను చూస్తుంటేనే “గూస్ బంప్స్ వచ్చేస్తాయి అన్నా!” అని కామెంట్స్ చేస్తున్నారు. ముందుగానే అభిమానులు పవన్ కళ్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తున్నారు. సోషల్ మీడియా వ్యాప్తంగా, ఎక్కడ చూసినా “హ్యాపీ బర్త్‌డే పవన్” అన్న అని కామెంట్స్ వరుసగా కనిపిస్తున్నాయ్. ఈ రోజు పరిస్ధితి ఇలా ఉంటే..ఇక రేపు సిచ్యూవేషన్ ఎలా ఉంటుందో...? అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు..!!



మరింత సమాచారం తెలుసుకోండి: