1980లో హీరోగా ఎన్టీఆర్‌ కెరీర్‌ పీక్‌లోకి చేరినప్పుడు, వరుస విజయాల‌తో దూసుకుపోయ‌డు. అడవి రాముడు, వేటగాడు వంటి మూవీలతో ఆడియెన్స్‌ను కదిలించాక, ఆయన దృష్టి పూర్తిగా కమర్షియల్‌ హిట్ల వైపు ఫోకస్ అయింది. అలాంటి జోరులో 1982 జులై 9న విడుదలైన బొబ్బిలిపులి సినిమా పెద్ద సంచలనాన్ని సృష్టించింది. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం, పొలిటికల్‌ సెటైర్లతో ఉన్న కారణంగా మొదట ప్రభుత్వం విడుదలకు అడ్డంకులు పెట్టింది. కానీ ఎన్టీఆర్‌, నిర్మాతలు పడిన పోరాటం ఫలితంగా సినిమా రిలీజ్ అయ్యింది.


మూవీ వారం రోజులలోనే అంచనాలను పక్కన పెట్టి తొలిరోజే రూ.13 లక్షల వసూలు చేసింది. 50 లక్షల బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ మూవీ లాంగ్ రన్‌లో 3.5 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్‌ రికార్డులు కూల్చేసింది. 39 సెంటర్లలో 100 రోజులు, కొన్ని సెంటర్లలో 175 రోజులు ప్రదర్శన, కొన్ని థియేటర్లలో ఏడాదిపాటు షిఫ్టులు మారుతూ ప్రదర్శన జరగడం విశేషం. ఈ విజయంతో ఎన్టీఆర్‌కి రాజకీయాల్లోకి అడుగు పెట్టే మార్గం సులభమైపోయింది. అలాగే, చిరంజీవికి ఈ సందర్భం చిన్న సవాలు ఇచ్చింది. ఎన్టీఆర్‌ సినిమాకి వారం గ్యాప్‌ తర్వాత ఇది పెళ్లంటారా రిలీజ్ అయ్యింది. విజయ్‌ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, క్రాంతికుమార్‌ నిర్మాణంలో వచ్చినప్పటికీ ఆడియెన్స్ అంత‌గా మెప్పించ‌లేక‌పోయింది .. దీంతో చిరు ఆలోచనలో పడాల్సి వచ్చింది.



అయితే, చిరంజీవి త‌ర్వాత‌. ఖైదీతోనే ఆయన రైజింగ్ స్టార్‌ పతాకం ఎత్తుకున్నారు. ఆ తర్వాత వరుసగా కమర్షియల్‌ హిట్లతో, పాటలు, డాన్సులు, ఫైట్లతో ఆడియెన్స్‌ ని పిచ్చి పెట్టారు. రామారావు రాజకీయాల్లోకి వెళ్తే, ఆ స్థానాన్ని చిరు సూపర్‌ స్టార్‌గా భర్తీ చేసారు. ఇప్పుడు 70 ఏళ్ల వయసులోనూ యంగ్ హీరోలకు సరిగా పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి చేతిలో నాలుగు ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి: విశ్వంభర, మన శంకరవరప్రసాద్‌ గారు షూటింగ్‌లో, శ్రీకాంత్ ఓదెల సినిమా, బాబీ మూవీ ప్రారంభం కావాల్సి ఉంది. ఎన్టీఆర్  హీరోగా వచ్చిన బొబ్బిలిపులి వంటి సినిమాలు ఆయ‌న‌ రాజకీయ, కమర్షియల్ జీవితాన్ని మ‌రో మ‌లుపు తిప్ప‌యి. ఇక చిరు మాత్రం తన స్ట్రాంగ్ ఫేమ్‌, ఫైట్స్‌, డాన్సులు, పాటల పిచ్చితో ఈ ఇండస్ట్రీకి సూపర్‌ స్టార్‌ స్థాయి వెళ్ళారు . ఇప్పటికీ 70 ఏళ్ల వయసులో కూడా చిరంజీవి కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ ఇండస్ట్రీలు దూసుకుపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: