
అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతున్న విషయం ఏమిటంటే .. జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న పనిని మిగతా స్టార్ హీరోలు ఎప్పటికీ చేయలేరని నందమూరి అభిమానులు పొగడ్తలు కురిపిస్తున్నారు. అంతేకాదు, కొందరు ఏకంగా “ఎన్టీఆర్ చేస్తున్న ఈ పని సక్సెస్ అయితే, మిగతా స్టార్ హీరోలు ఇండస్ట్రీలో పేమెంట్ గ్యారంటీగా కూడా ఉండలేరు. వాళ్లకు అంత సీన్ లేదు” అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ ఎన్టీఆర్ చేస్తున్న పని ఏంటంటే — ఆయన బ్యాక్ టు బ్యాక్ డిఫరెంట్ కాన్సెప్ట్ స్టోరీస్‌ని ఎంచుకోవడమే కాకుండా, మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్స్‌కి ఛాన్స్ ఇస్తున్నారు. అది తెలుగు, హిందీ, తమిళం అనే భాషా భేదం లేకుండా — కొత్త కాన్సెప్ట్స్‌ని ఎంకరేజ్ చేస్తున్న డైరెక్టర్స్‌కి అవకాశం ఇవ్వడం ఆయన ప్రత్యేకత. తెలుగు ఇండస్ట్రీలో బిగ్ స్టార్స్ అంటే కచ్చితంగా ఐదు పేర్లు వినిపిస్తాయి. ఆ ఐదు స్టార్ హీరోల్లో ఎవరు కూడా ఇతర భాషల డైరెక్టర్స్‌కి ఎక్కువగా అవకాశం ఇవ్వడం లేదు. కానీ ఎన్టీఆర్ మాత్రం పక్క భాషల ఇండస్ట్రీల నుండి కూడా టాలెంటెడ్ డైరెక్టర్స్‌కి ఛాన్స్ ఇస్తూ ఉండటం ఒక హైలైట్ పాయింట్.
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఆ తర్వాత తెలుగు డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. అంతేకాక, లోకేష్ కనకరాజ్ (తమిళ డైరెక్టర్) దర్శకత్వంలో ఓ సినిమా, ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా బ్యాక్ టు బ్యాక్ వేర్వేరు భాషల డైరెక్టర్స్‌కి ఛాన్స్ ఇస్తూ, డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో ముందుకు వెళ్తున్న తారక్‌లో ఉన్న కొత్త యాంగిల్ బయటపడుతోందని అభిమానులు అంటున్నారు. నిజంగా ఇది వర్కౌట్ అయితే మాత్రం, మిగతా స్టార్ హీరోలు ఎన్టీఆర్ క్రేజ్‌ని, ఆయన ఎదిగే తత్వాన్ని చూసి కుళ్లుకొని చచ్చిపోవాల్సిందే అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.