
“పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమాలో అఖీరా నందన్ నటించారు” అని బలంగా నమ్ముతున్నారు. తాజాగా రిలీజ్ అయిన షాట్స్‌లో కూడా అఖీరా నందన్ ఉన్నారు అని కొంతమంది ఆ క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇది నిజమా..? లేదా..? అని ఫ్యాన్స్ కొంత మంది ఆలోచిస్తూ, చర్చల్లో మునిగిపోతున్నారు. సుజిత్ డైరెక్షన్ లో పవన్ ని చూడబోతున్నం అంటూ ఫ్యాన్స్ ఫుల్ ఎక్సైట్ గా ఉంటే..ఇప్పుడు ఈ సినిమాలో అఖీరా ని కూడా చూడబోతున్నాం అంటూ ఓ న్యూస్ ట్రెండింగ్ లోకి రావడం మరింత ఇంట్రెస్టింగ్గా మారింది.
ఇంకో ఆసక్తికర న్యూస్ ఏంటంటే, “ఓ జీ” గేమ్ ఒకటి నెట్టింట బాగా వైరల్ అవుతుంది. ఈ గేమ్ లోని కొన్ని షాట్స్‌లో కత్తితో ఉన్న కళ్ళు చూపిస్తారు. ఆ కళ్ళు పవన్ కళ్యాణ్ వి కానే కావు. కానీ అవి యంగ్ లుక్ ఉన్న కళ్ళు, బాగా పరిశీలిస్తే అవి అఖీరా నందన్ కళ్ళు లానే ఉన్నాయి. ఫ్యాన్స్ ఈ పిక్స్‌ను ట్రెండ్ చేస్తూ, “అఖీరా నందన్ ‘ఓ జీ’లో నటించాడా?” అని రచ్చ రంబోలా చేస్తున్నారు. ఒకే సినిమాలో తండ్రి-కొడుకులు కలిసి కనిపించడం వలన ఫ్యాన్స్ ఫీలింగ్ పూర్తిగా మరో లెవెల్ లోకి వెళ్లిపోతుంది. ఈ ప్రత్యేకమైన మూమెంట్ కోసం అభిమానులు ఉత్సాహంగా వేచిచూస్తున్నారు. అయితే, ఇప్పటివరకు చిత్రబృందం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. సోషల్ మీడియా మాత్రమే ఈ వార్తను బాగా ట్రెండ్ అవుతుంది. అస్సలు ఇది ఎంత వరకు నీజ్మ్ అనేది తెలియాలి అంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే..!