ఒక హీరో సినిమా విడుదలవుతుంది అంటే ఆ హీరో అంటే నచ్చని మిగతా హీరోల అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ లేపుతూ ఉంటారు.అలా తాజాగా పవన్ కళ్యాణ్ సినిమా విడుదలవుతున్న వేళ బన్నీ ఫ్యాన్స్ అందరూ సోషల్ మీడియాలో కాచుకు కూర్చున్నారు. ఓజి లో ఏ చిన్న మిస్టేక్ దొరికినా చాలు సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేద్దాం అని ఫిక్స్ అయిపోయారు.ఈ నేపథ్యంలోనే ఓజీ కి సంబంధించి కొంత మంది బన్నీ ఫ్యాన్స్ పెట్టిన ట్రోల్స్,మీమ్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా బన్నీ ఫ్యాన్స్ అని చెప్పుకుంటున్న కొంతమంది సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు.అల్లు అర్జున్ చేసిన పుష్ప.టు స్మగ్లింగ్ సినిమా అని పవన్ కళ్యాణ్ అన్నారు.మరి పవన్ కళ్యాణ్ చేసే ఓజి సినిమా ఏమైనా భక్తిరస సినిమానా చెప్పండి అన్నట్లుగా పోస్ట్ పెట్టారు. ఇక ఈ పోస్టు క్షణాల్లో నెట్టింట వైరల్ అవ్వడంతో మిగిలిన బన్నీ ఫ్యాన్స్ కరెక్ట్ సమయంలో కరెక్ట్ పోస్ట్ పెట్టారు. 

దీనికి ఆన్సర్ ఇవ్వండి అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ పోస్ట్ పెట్టడానికి కారణం పవన్ కళ్యాణ్ బన్నీ నటించిన పుష్ప-2 విడుదలైన సమయంలో కర్ణాటక కుంకీ ఏనుగుల కోసం వెళ్లారు. అక్కడ ప్రెస్ మీట్ లో ఒకప్పుడ హీరోలంటే చాలా గొప్పగా ఉండేవారు. కానీ ఇప్పటి హీరోలు మాత్రం అడవులను నరుకుతూ స్మగ్లింగ్ చేస్తూ అదే హీరోయిజం అన్నట్లుగా చూపిస్తున్నారు అని మాట్లాడారు. అయితే పవన్ ఈ మాటలు మాట్లాడిన టైంలోనే పుష్ప టు విడుదలైంది. దాంతో పవన్ మాటలు పుష్ప టు మూవీకి కౌంటర్గా అని చాలామంది బన్నీ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు.ఇక అప్పటి పవన్ వ్యాఖ్యలను గుర్తు పెట్టుకున్న బన్నీ ఫ్యాన్స్ పుష్ప టు స్మగ్లింగ్ సినిమా అన్నారు మరి ఓజి సినిమా భక్తి రస సినిమానా అంటూ ట్రోల్స్, మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ప్రెస్ మీట్ లో హీరోలను చూసి చాలామంది అభిమానులు ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. 

హీరోనే ఇలా చేస్తే అభిమానులు కూడా అలాగే చేస్తారు కదా అని మాట్లాడారు.మరి ఇప్పుడు ఓజి సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తున్నారు. మరి పవన్ గ్యాంగ్ స్టర్ గా చేస్తే అభిమానులు కూడా గ్యాంగ్ స్టర్లు గానే మారతారా అన్నట్లుగా బన్నీ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. దీనికి పవన్ ఫ్యాన్స్ ఒక హీరో సినిమాని మరో హీరో అభిమానులు టార్గెట్ చేయడం బాగుండదు.ఓజీ, పుష్ప టు రెండు కమర్షియల్ సినిమాలే వాటిని టార్గెట్ చేయకూడదు అని కౌంటర్ ఇస్తున్నారు.కానీ ఈ కౌంటర్లకి అప్పుడు మీ హీరో మా హీరో సినిమాకి కౌంటర్ ఇస్తే మీ నోర్లు లేవలేదు.. ఇప్పుడు ఎందుకు లేస్తున్నాయి అంటూ రీ కౌంటర్ ఇస్తున్నారు. అలా ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ అభిమానుల మధ్య వార్ నడుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: