మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమణి సంయుక్త మీనన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ పవన్ కళ్యాణ్ , దగ్గుపాటి రానా హీరోలుగా రూపొందిన భీమ్లా నాయక్ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ లో ఈమె రానా కి భార్య పాత్రలో నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈమె నటించిన బింబిసారా , సార్ , విరూపాక్ష సినిమాలు వరుసగా విజయాలను అందుకున్నాయి. దానితో ఈమె క్రేజ్ ఒక్క సారిగా తెలుగు సినీ పరిశ్రమలో పెరిగిపోయింది.

ఆఖరుగా ఈమె కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన డెవిల్ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమా విడుదల అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతుంది. కానీ ఇప్పటివరకు డెవిల్ సినిమా తర్వాత ఈమె నటించిన ఏ సినిమా కూడా విడుదల కాలేదు. వరుసగా విజయాలను అందుకున్న ఈమెకు ఒక్క అపజయం రావడం తోనే చాలా కాలం గ్యాప్ తీసుకొంది. కానీ ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఏకంగా 8 సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ నిఖిల్ హీరోగా రూపొందుతున్న స్వయంభు అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. 

అలాగే పూరి జగన్నాథ్ , విజయ్ సేతుపతి కాంబోలో రూపొందుతున్న సినిమాలో కూడా ఈమె హీరోయిన్గా నటిస్తోంది. శర్వానంద్ హీరోగా రూపొందుతున్న నారీ నారీ నడుమ మురారి సినిమాలో కూడా ఈ బ్యూటీ హీరోయిన్గా నటిస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ తో హైందవ అనే సినిమాలో నటిస్తోంది. రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్న బెంజ్ మూవీలోను , హిందీ లో మహారాణి సినిమాలోను ఈమె నటిస్తోంది. అలాగే బాలకృష్ణ హీరో గా రూపొందుతున్న అఖండ 2 మూవీలో కూడా ఈమె నటిస్తోంది. ఇలా ప్రస్తుతం ఈమె చేతిలో ఏకంగా 8 సినిమాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

sm