
అసలు విషయంలోకి వెళ్తే రాజస్థాన్లోని ఉదయపూర్ ప్రాంతంలో ఎక్కువగా కోట ప్రాంతం కాబట్టి కోటలు ఎక్కువగా ఉంటాయి. అందుకు తగ్గట్టుగానే అక్కడ ప్రజలు కూడా రాజసంతో జీవిస్తూ ఉంటారు. అక్కడ ప్రజలు వారి యొక్క వేషధారణ అద్భుతంగా ఉంటుంది. అటువంటి ప్రాంతంలో అడవులు కూడా కొంత ఎక్కువగానే ఉన్నాయి. అడవులలో పలు రకాల జంతువులు సంచరిస్తుంటాయి. ముఖ్యంగా చిరుత పులులు సంచరిస్తూ ఉంటాయి. అలా ఉదయపూర్ ప్రాంతంలో ఒక ఇంట్లోకి చిరుత పులి ప్రవేశించగా చిరుత పులి రాగానే ఆ ఇంటి మహిళ ఎటువంటి భయం లేకుండా చాకచక్యంగా ప్రవర్తించింది.
ఇంట్లోకి ప్రవేశించిన చిరుత పులిని ఆ మహిళ గదిలో ఉండగానే తలుపులు వేసి అంతే వేగంగా ఒక వస్త్రాన్ని చిరుత పులి మీద కప్పి,అనంతరం ఒక తాడుతో చిరుత పులి కాలును కట్టి వేసి ఆ తర్వాత బయటికి వెళ్లి తలుపులు వేసినట్టుగా ఈ వీడియోలో కనిపిస్తోంది.
