సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు లోక నాయకుడు కమల్ హాసన్ ఓకే తరిపై చూడాలని తమిళ్ ఫాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తూ ఉన్నారు . ఈ క్రేజీ కాంబోలో మూవీ రాబోతుంది అంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నప్పటికీ ఈ మూవీ నుంచి ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు . ఇక మొదట లోకేష్ కనకరాజు డైరెక్షన్లో ఈ మల్టీస్టారర్ మూవీ రూపొందుతుందని ప్రచారాలు వినిపించాయి . కానీ రజనీకాంత్ కూలి మూవీ ఫ్లాప్ తో ఈ క్రేజీ కాంబినేషన్ బ్రేక్ అయిందని వార్తలు గుప్పుమంటున్నాయి . దీంతో అభిమానులు నిరుత్సాహ పడుతున్నారని చెప్పుకోవచ్చు  .


ఈమధ్య మరో కొత్త విషయం సోషల్ మీడియాలలో వైరల్ అవుతుంది . యువ దర్శకుడు కం హీరో అయినటువంటి ప్రదీప్ రంగనాథ్ ఈ మూవీకు దర్శకత్వం వహించబోతున్నారని ప్రచారాలు జరిగాయి . లవ్ టుడే మరియు డ్రాగన్ వంటి చిత్రాలతో హిట్ కొట్టిన ఈయన తెలుగులో కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు . ఇక ప్రదీప్ రంగనాథ్ తన తాజా మూవీ డూడ్ ప్రమోషన్ లో ఈ పుకార్లపై స్పష్టత ఇచ్చాడు .


నా దృష్టి అంత ప్రస్తుతం యాక్టింగ్ పైనే ఉందని రజనీకాంత్ కమల్ హాసన్ మూవీ కు నేను డైరెక్టర్ ని కాదు అని ఆయన వెల్లడించాడు . ఇక ప్రదీప్ ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడంతో రజనీకాంత్ మరియు కమల్ హాసన్ కాంబినేషన్ మళ్ళీ అటకెక్కిందని తెలుస్తుంది . అభిమానులు ఎంతో ఆశగాలు ఎదురుచూస్తున్న ఈ కలలా ఫిలిం ఇప్పట్లో తెరకెక్కినట్లు కనిపించడం లేదు . మరి ఈ మూవీ నీ తర్కెక్కించేందుకు ఎవరైనా ముందుకొస్తేనే గాని ఈ కళ ప్రేక్షకులకు నెరవేరదని చెప్పుకోవచ్చు . ప్రజెంట్ ఇదే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది .

మరింత సమాచారం తెలుసుకోండి: