టాలీవుడ్‌ ఇండస్ట్రీలో “రాజమౌళి” అనే పేరుకి ఉన్న గౌరవం, గుర్తింపు, స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన పేరు వినగానే ప్రతి సినీప్రియుడి మనసులో గర్వభావం కలుగుతుంది. ఎందుకంటే ఆయన కేవలం తెలుగు సినిమా దర్శకుడు మాత్రమే కాదు — భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన వన్ అండ్ ఓన్లీ విజనరీ డైరెక్టర్ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.ఒకప్పుడు తెలుగు సినిమాను కేవలం లోకల్ మార్కెట్‌లో మాత్రమే పరిమితం అయ్యే స్థితి నుండి గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌కి తీసుకెళ్లిన వ్యక్తి రాజమౌళి. ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. విక్రమార్కుడు, ఈగ, మగధీర, బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ వంటి సినిమాలు కేవలం హిట్‌ సినిమాలు కాదు — ప్రతి ఒక్కటీ భారతీయ సినిమా స్థాయిని పెంచిన మాస్టర్‌పీసెస్‌.


రాజమౌళి సినిమాల్లో కనిపించే విశాల దృక్పథం, సున్నితమైన భావోద్వేగాల మేళవింపు, కథ చెప్పే తీరు ఆయనకే ప్రత్యేకం. ప్రతి ఫ్రేమ్ వెనుక ఆయన కష్టం, విజన్, పర్‌ఫెక్షన్ స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన నటీనటులను సీన్ల కోసం ఎంత కష్టపెడతారో అందరికీ తెలిసిందే, కానీ అదే సమయంలో ఆ కష్టమే విజయానికి బాటలు వేసింది. ఈరోజు, ఆయన పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా అంతా రాజమౌళి ఫోటోలు, ఆయన పనితనం గురించి పోస్టులతో నిండిపోయింది. అభిమానులు ఆయన జీవితంలోని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్‌ని పంచుకుంటూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఒక ఆసక్తికర అంశం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది —


ఈ ప్రశ్నకు స్వయంగా రాజమౌళి గతంలో ఒక ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ, “నేను డైరెక్టర్‌గా సెటిల్ కాలేకపోయి ఉంటే ఖచ్చితంగా లెక్చరర్‌గా మారి ఉండేవాడిని” అని చెప్పారు. ఆయనకు టీచింగ్ అంటే చిన్నప్పటి నుంచీ చాలా ఇష్టం. ఏ విషయం అయినా ఇతరులకు అర్థమయ్యేలా వివరించడం, సిస్టమాటిక్‌గా చెప్పడం ఆయనకు సహజసిద్ధమైన నైపుణ్యం. అందుకే లెక్చరర్‌ ఉద్యోగం తనకు బాగా సరిపోతుందని రాజమౌళి అనుకునేవారట.అయితే, ఆయనలోని కృషి, పట్టుదల, శ్రమ, దృఢనిశ్చయమే ఆయనను భారతీయ సినీ చరిత్రలో అజరామరమైన దర్శకుడిగా నిలబెట్టింది. ఇప్పుడు ఆయన స్థానం ఎవరూ దాటలేని స్థాయిలో ఉంది. టాలీవుడ్‌ చరిత్రలోనే కాదు, ఇండియన్‌ సినిమాల చరిత్రలో కూడా రాజమౌళి పేరు గోల్డ్ లెటర్స్‌లో రాసుకోవాల్సిందే.



సోషల్ మీడియాలో అభిమానులు సరదాగా, “రాజమౌళి లెక్చరర్‌గా ఉన్నట్లయితే ఆయన స్టూడెంట్స్‌ ఎంత బాగా సక్సెస్‌ అయ్యేవారో!” అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు “రాజమౌళి లెక్చరర్‌గా ఉంటే క్లాస్‌ తప్పిపోకుండా వెళ్లేవాళ్లం” అంటూ హ్యూమర్‌గా రాస్తున్నారు. ఏదేమైనప్పటికీ, ఒక సాధారణ వ్యక్తి నుండి ప్రపంచస్థాయి దర్శకుడిగా ఎదిగిన రాజమౌళి ప్రయాణం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. ఆయన సినిమాలు మనకు ఎంటర్‌టైన్‌మెంట్‌ మాత్రమే కాదు — కలలని నిజం చేసే నమ్మకం కూడా ఇస్తాయి.ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీప్రియులు, అభిమానులు, ఇండస్ట్రీలోని సహచరులు రాజమౌళికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: