సినిమా ఇండస్ట్రీలో ఒక్క అవకాశం దక్కించుకోవడం అనేది సాధారణ విషయం కాదు. ఇది నేటి తరం ఆర్టిస్టులకి మరింత సవాలుగా మారిపోయింది. గతంలో పెద్ద స్టేజ్‌లు, ఆడిషన్స్, పరిచయాలు అవసరమయ్యేవి. కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని, తమలోని టాలెంట్‌ని బయటపెట్టడానికి ఎన్నో ప్లాట్‌ఫారమ్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, షార్ట్ ఫిల్మ్స్ వంటి వేదికల ద్వారా చాలా మంది యువ ప్రతిభావంతులు తమ స్కిల్స్‌ని చూపించి, ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. అయితే ఈ పోటీ ప్రపంచంలో నిలబడటం మాత్రం అంత ఈజీ కాదు.


అలాంటి టఫ్ కాంపిటిషన్ మధ్యలోనే, ఓ యువ నటుడు జై కృష్ణ జాక్పాట్ కొట్టేశాడు. "లిటిల్ హార్ట్స్" సినిమాలో మౌలి ఫ్రెండ్‌గా నటించిన ఆ అబ్బాయి గుర్తున్నాడు కదా? అతడి పేరే జై కృష్ణ! సినిమాను చూసిన వారందరికీ అతని కామెడీ టైమింగ్, నేచురల్ యాక్టింగ్ మైండ్‌బ్లోయింగ్‌గా అనిపించింది. చిన్న రోల్ అయినప్పటికీ, తన నటనతో ఆడియెన్స్ మనసు గెలుచుకున్నాడు."లిటిల్ హార్ట్శ్" సినిమా రీలీజ్ అయిన తర్వాత మౌలి పేరు ఎంత పాపులర్ అయ్యిందో, అంతే రేంజ్‌లో జై కృష్ణ పేరు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ప్రత్యేకంగా యువతరంలో "ఈయన కామెడీ చేస్తే వేరే లెవెల్" అంటూ నెటిజన్లు ఫ్యాన్‌గా మారిపోతున్నారు.



ఇక తాజాగా ఈ యువ నటుడిపై ఇండస్ట్రీలో భారీ వార్త ట్రెండ్ అవుతోంది. రీసెంట్ గా లిటిల్ హార్ట్స్ సినిమా చూసిన సమంత  జై కృష్ణ నటనకి ఫిదా అయిపోయిందట. అంతేకాదు, "లిటిల్ హార్ట్స్" సినిమా చూసిన వెంటనే దర్శకుడు సాయి మార్తాండ్‌కు ఫోన్ చేసి, “జై కృష్ణ చాలా బాగా చేశాడు. వెంటనే అతనితో ఓ మంచి కథ రెడీ చేయి, నేను ఆ సినిమాకి నిర్మాతగా ఉంటాను” అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చిందట! సమంతలాంటి స్టార్ హీరోయిన్ స్వయంగా ప్రొడ్యూసర్‌గా ముందుకు రావడం అంటే చిన్న విషయం కాదు. దానికి దర్శకుడు సాయి మార్తాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అన్నీ సెట్ అయితే, సమంత నిర్మాతగా, జై కృష్ణ హీరోగా కొత్త ప్రాజెక్ట్ రాబోతోందని సమాచారం.



జై కృష్ణకు ఇది నిజంగానే జీవితంలో పెద్ద లక్కి అవకాశం. ఇండస్ట్రీలో ఇలాంటి ఛాన్స్ ప్రతి ఒక్కరికీ రావు. స్టార్ హీరోల మధ్యలో కొత్త ఫేస్‌గా, సమంత వంటి పెద్ద హీరోయిన్ ప్రోత్సాహం దక్కించుకోవడం నిజంగా అదృష్టం. అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాలో "జై కృష్ణ సూపర్ సక్సెస్ అయ్యాడు", "ఇది అతని లైఫ్ టర్నింగ్ పాయింట్" అంటూ కామెంట్లు చేస్తున్నారు. చూడాలి మరి ఈ కాంబినేషన్ ఎప్పుడు ఫైనల్ అవుతుందో..?? ఎప్పుడు షూటింగ్ మొదలవుతుంది అనేది. కానీ ఒక విషయం మాత్రం క్లియర్ — జై కృష్ణ పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో బాగా గట్టిగా వినిపిస్తుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: