టాలీవుడ్ స్టార్ బోయ్ సిద్ధు జొన్నలగడ్డ నటించిన తాజా రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘తెలుసు కదా’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను కాస్ట్యూమ్ డిజైన‌ర్ నీరజ కోన దర్శకత్వం వహించగా, ప్రేమ, భావోద్వేగాలు, స్టైలిష్ ప్రెజెంటేషన్ కలగలిపిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. విడుదల రోజు నుంచే సినిమాకు మిక్స్‌డ్‌ రివ్యూలు వచ్చినా ప్రేక్షకుల మద్దతుతో బాక్సాఫీస్ వద్ద మంచి రన్ కొనసాగిస్తోంది. ఈ సినిమా 
మూడు రోజులలోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.14.1 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టిందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ముఖ్యంగా అర్బన్ యూత్‌కు సినిమా బాగానే కనెక్ట్ అవుతుండటం, వరుస సెలవులు రావడంతో కలెక్షన్లు ఊపందుకున్నాయి. దీపావళి సెలవుల వారం ఈ సినిమా వసూళ్లకు మరింత బలం చేకూర్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రేంజ్‌కు త‌గిన వ‌సూళ్లు అయితే ఇవి కావ‌ని అంటున్నారు.


సిద్ధు జొన్నలగడ్డ తన ప్రత్యేకమైన స్టైల్, డైలాగ్ డెలివరీతో మరోసారి ఆకట్టుకున్నారు. రొమాంటిక్ సన్నివేశాల్లోనూ, ఎమోషనల్ సీన్స్‌లోనూ ఆయన న్యాయం చేశారని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఇక తెలుసుక‌దా సినిమాలో రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించగా, ఇద్దరి గ్లామర్, కెమిస్ట్రీ సినిమా హైలైట్‌గా నిలిచింది. ముఖ్యంగా రాశి ఖన్నా - సిద్ధు జొన్నలగడ్డ జంట స్క్రీన్‌పై కనిపించిన ప్రతీసారి థియేటర్లలో చప్పట్లు వినిపిస్తున్నాయి. మ్యూజిక్ విషయంలో థమన్ మరోసారి తన మార్క్ చూపించారు. ప్రతి సాంగ్ యువతలో పాపులర్ అవుతూ, సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ విలువలు కూడా అద్భుతంగా ఉన్నాయని ప్ర‌శంస‌లు వ్య‌క్తం అవుతున్నాయి.


పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం, శ్రద్ధా ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి రూపొందించబడింది. మొత్తంగా, ‘తెలుసు కదా’ రొమాంటిక్ డ్రామాలను ఇష్టపడే ప్రేక్షకులకు సరైన ఫీల్ గుడ్ మూవీగా నిలుస్తోంది. రాబోయే రోజుల్లో సెలవుల సీజన్ ఈ సినిమాకు మరింత బాక్సాఫీస్ బూస్ట్ ఇవ్వడం ఖాయమని అనిపిస్తోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ? మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ : వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sj